విశాఖలోని పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భర్త రెచ్చిపోయాడు.. భార్య, అత్తపై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచాడు. పెందుర్తి దగ్గువాని పాలెం కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. భార్య కనకమహాలక్ష్మి, అత్త లక్ష్మీపై సుత్తితో తలపై కొట్టి దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు అప్పారావు. ఇంట్లో అరుపులు కేకలు విని అడ్డుకోవడానికి వెళ్లిన వారిపై కూడా దాడికి పాల్పడ్డాడు అప్పారావు.. తీవ్ర గాయాలైన కనకమహాలక్ష్మి, లక్ష్మీలను పెందుర్తి ప్రభుత్వ హాస్పిటల్ కి స్థానికులు తరలించారు. విషయం తెలుసుకున్న పెందుర్తి పోలీసులు హాస్పిటల్ కి చేరుకొని భర్త అప్పారావును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.