Water Tax: భూమిలోని నీటిని తోడితే ట్యాక్స్ కట్టాల్సిందే.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Water Tax: రాజులు, బ్రిటీషర్ల కాలంలో విచిత్రమైన పన్నులు ఉండేవని విన్నాం.. పుస్తకాల్లో చదువుకున్నాం కానీ.. ప్రస్తుతం మళ్లీ అలాంటి రోజులే రాబోతున్నాయని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నిత్యం పెరుగుతున్న ధరల కారణంగా సాధారణ ప్రజలు బతకడానికి నానాపాట్లు పడుతున్నారు. ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశంగా చెలామణి అవుతున్నప్పటికీ ఇంకా చాలా మంది ఒక్క పూట అన్నానికి కూడా నోచుకోని వారున్నారు. ఈ క్రమంలో ఒక పూట తిని రెండో పూట నీరు తాగిపడుకుందామనుకునే వారికి కూడా ప్రభుత్వాలు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి.. తాజాగా పంజాబ్‌లోని భగవంత్ మాన్ సర్కార్ రైతులకు, ఇతర వర్గాలకు షాకిచ్చింది. భూమిలోంచి నీటిని తోడితే పన్ను విధిస్తామని స్పష్టం చేసింది.
Read Also: Hyderabad Traffic Alert : హైదరాబాద్‌లో నేటి నుంచి 40 రోజులు ఆ రూట్‌కు వెళ్లకండి
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
ఫిబ్రవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి పంజాబ్ రాష్ట్ర నీటి నియంత్రణ, అభివృద్ధి యంత్రాంగం నోటిఫికేషన్ జారీ చేసింది. భూగర్భ జలాన్ని కాపాడేందుకు వీలుగానే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రజలకు ఈ విషయంలో చిన్న వెసులుబాటు కల్పించింది సర్కార్. వ్యవసాయానికి, ఇంటి తాగునీటి అవసరాలకు వినియోగిస్తే ఎలాంటి పన్ను విధించబోమని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. అలాగే ప్రభుత్వ నీటి పంపిణీ పథకాలు, సైనిక బలగాలు, పుర, నగర పాలక, పంచాయతీ రాజ్ సంస్థలు, కంటోన్మెంట్ బోర్డులు, అభివృద్ధి మండళ్లు, ప్రార్థనా స్థలాలకు కూడా మినహాయింపు కల్పించారు. మిగిలిన వారు మాత్రం భూగర్భ జలాల్ని వాడుకునేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పంజాబ్‌లో భూగర్భ జలవనరులు నానాటికీ అంతరించిపోతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే భగవంత్ మాన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
Read Also: Tamilnadu: తప్పిన పెనుప్రమాదం.. అర్ధరాత్రి రన్నింగ్ బస్సులో చెలరేగిన మంటలు
తాజావార్తలు
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!