Bomb Threat: ఆ సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తాం.. ఏకంగా ముఖ్యమంత్రికే బాంబు బెదిరింపు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Threat: పంజాబ్‌లో మరోసారి బాంబు బెదిరింపులు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కార్యాలయానికే బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏకంగా సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తామంటూ మెయిల్ రావడం కలకలం సృష్టించింది. కేవలం ముఖ్యమంత్రినే కాకుండా, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాఖర్‌ను సైతం లక్ష్యంగా చేసుకుంటూ దుండగులు ఈ మెయిల్ పంపారు. ఇందులో పంజాబ్ బీజేపీ ప్రధాన కార్యాలయంతో పాటు చండీగఢ్, ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్‌ను సైతం పేల్చివేస్తామని స్పష్టంగా పేర్కొనడం గందరగోళానికి గురి చేస్తోంది. ఈ పరిణామంతో అప్రమత్తమైన భద్రతా సంస్థలు ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశాయి.
ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయం, బీజేపీ ఆఫీసుల వద్ద భద్రతా వలయాన్ని మరింత కట్టుదిట్టం చేశారు. అయితే పంజాబ్‌లో ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ప్రైవేట్ పాఠశాలలకు సైతం ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. మే 7న జలంధర్‌లోని బి.ఎం.సి చౌక్ వద్ద ఉన్న ఏపీజే స్కూల్‌కు బాంబు బెదిరింపు రావడంతో అప్పట్లో తీవ్ర కలకలం రేగింది. దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం వెంటనే విద్యార్థులందరికీ సెలవు ప్రకటించి ఇళ్లకు పంపించేసింది. ఆ సమయంలో స్కూల్ క్యాంపస్‌లో తీవ్ర గందరగోళం, భయాందోళనలు నెలకొన్నాయి. పంజాబ్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న ఈ బాంబు బెదిరింపు ఘటనలు ఇప్పుడు సామాన్య ప్రజలను సైతం ఆందోళనకు గురిచేస్తున్నాయి.
Also Read
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
- Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
-
Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
-
Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!