CM Bhagwant Mann: ఆస్పత్రిలో చేరిన సీఎం.. వైద్యులు ఏమన్నారంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Bhagwant Mann: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆస్పత్రిలో చేరారు. గత రెండు రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈరోజు ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి పంజాబ్ వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లాల్సిన పర్యటనకు రద్దు అయ్యింది.
READ ALSO: Top Headliens @9PM : టాప్ న్యూస్
Also Read
- Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
- Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
- Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్‌డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
- Parthiv Patel: హిట్‌మ్యాన్‌ను తక్కువ అంచనా వేయొద్దు'.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
కేబినెట్ సమావేశం వాయిదా..
పంజాబ్‌లో వరద పరిస్థితికి సంబంధించి ఈ సాయంత్రం చండీగఢ్‌లోని పంజాబ్ సీఎం హౌస్‌లో జరగనున్న ముఖ్యమైన రాష్ట్ర క్యాబినెట్ సమావేశాన్ని సీఎం ఆరోగ్య కారణాల దృష్ట్యా ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు సమాచారం. ఈ సమావేశంలో వరదల గురించి చర్చించాల్సి ఉంది. ఆయన గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. కానీ ఈరోజు ఆయన ఆరోగ్యం క్షీణించడంతో, వెంటనే ఆయనను ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సీఎం ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో ఉన్నారు.
గురువారం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ఆయన తన పర్యటనలో చాలా మంది ప్రజలు కలిసి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా మంది ప్రజలు వారి ఇళ్లను వదిలి వెళ్లడానికి ఇష్టపడటం లేదని, వారికి గ్రామంలోనే సహాయం అందిస్తున్నామని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు వరదల్లో చిక్కుకున్న ప్రజలకు సహాయం చేస్తున్నారని అన్నారు.
గత కొన్ని రోజులుగా పంజాబ్‌లో కురుస్తున్న భారీ వర్షాల రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి.అనేక జిల్లాలు ఇప్పటికి వరదల గుప్పిట్లో ఉన్నాయి. ప్రజలకు సహాయం అందించడానికి సైన్యం సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటికే వరదల్లో చిక్కుకున్న వేలాది మందిని సురక్షిత ప్రదేశాలకు, సహాయక శిబిరాలకు తరలించారు. వరదల కారణంగా చాలా మంది మరణించారని పలు నివేదికలు పేర్కొన్నాయి.
READ ALSO: Immigration Scam: వామ్మో ఆమెకు 15 మంది భర్తలు.. ఈ పాపం ఆమెకే తెలియదంటా..
తాజావార్తలు
-
Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
-
Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్‌డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
-
Parthiv Patel: హిట్‌మ్యాన్‌ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
-
Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?