Mercedes Car Accident : మంగళవారం (జూన్ 18) మధ్యాహ్నం జరిగిన మరో ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడు మెర్సిడెస్ కారు కింద నలిగిపోయాడు. పూణే (pune) నగరంలోని ఎరవాడ (Yerwada) లోని గోల్ఫ్ కోర్స్ చౌక్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. దింతో కారు యజమానిని అదుపులోకి తీసుకుని ఎరవాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇక బైక్ బాధితుడిని కేదార్ మోహన్ చవాన్ (41)గా గుర్తించారు పోలీసులు. కారు డ్రైవర్ నందు అర్జున్ ధావలేను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Hyderabad Murder : ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని దారుణ హత్య.. మరొకరికి గాయాలు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం చవాన్ తన ద్విచక్ర వాహనంపై గోల్ఫ్ కోర్స్ చౌక్ వద్ద వెళ్తున్నాడు. అతని వాహనం వెనుక ఉన్న కారు అతనిపైకి వెళ్లడంతో అతని వాహనం స్కిడ్ అయ్యి అతను కింద పడిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చవాన్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎరవాడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.
Breaking: ఇరాన్‌లో భారీ భూకంపం..
డెలివరీ బాయ్ మీదకి దూసుకుపోయిన మెర్సిడెస్ కారు.. డెలివరీ బాయ్ మృతి.
పూణే – గోల్ఫ్ కోర్స్ చౌక్ దగ్గర డెలివరీ బాయ్ కేదార్ మోహన్ చౌహాన్(41) అదుపుతప్పి బైక్ పైనుండి కింద పడ్డాడు.
అదే సమయంలో వెనకనే వచ్చిన మెర్సిడెస్ కారు మోహన్ చౌహాన్‌పై ఎక్కడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు… pic.twitter.com/qCLVJJiims
— Telugu Scribe (@TeluguScribe) June 19, 2024