Pune horror: భర్త అమానుషం.. భార్య శీలాన్ని శంకించి ఏం చేశాడంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజు రోజుకు మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుంది. కట్టుకున్న భార్య పట్ల ఓ భర్త కర్కశంగా ప్రవర్తించాడు. కలకాలం తోడుగా.. అండగా ఉండాల్సిన అర్ధాంగి పట్ల దుశ్చర్యకు పాల్పడ్డాడు. వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఏకంగా శీలానికి తాళం వేశాడు దుర్మార్గపు భర్త. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది.
ఇది కూడా చదవండి: Payal Rajput: ప్రభాస్ చాన్స్ ఇస్తే నా కోరిక తీర్చుకుంటా.. హీరోయిన్ హాట్ కామెంట్స్..
Also Read
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
- Kriti Sanon: రాహుల్‌గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
- YS Jagan: 'సీఎంగా ఏం చేస్తున్నా' అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
- Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
నేపాల్‌కు చెందిన ఉపేంద్ర హుడాకే (30) తన భార్యతో కలిసి పూణెలో నివాసం ఉంటున్నాడు. పింప్రి-చించ్వాడ్లోని వాకాడ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. హుడాకే సోదరి, మరికొందరు కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. రోజూ తాగొచ్చి అనుమానంతో భార్యతో గొడవ పడుతున్నాడు. అంతటితో ఆగకుండా మృగంగా మారి.. భార్య జననాంగాలను ఇనుప మేకులతో ఛిద్రం చేసి తాళం వేశాడు. ఈ దారుణ ఘటన మే 11న జరిగింది. బాధితురాలి ఆక్రందనలు విన్న సహచర నేపాలీయులు ఆమె పరిస్థితిని చూసి ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో ఆమె ఇప్పటివరకు చికిత్స పొందుతూ వచ్చింది. మే 16న (గురువారం) డిశ్చార్జ్ కావడంతో జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు శనివారం పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె కోలుకుందని, ఆరోగ్యం మెరుగుపడిందని పోలీసులు వెల్లడించారు. భార్య ఫిర్యాదు మేరకు నేపాల్‌కు చెందిన ఉపేంద్ర హుడాకే (30)ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్య
దంపతులిద్దరూ నేపాల్‌కు చెందిన వారని.. పనుల నిమిత్తం పూణె వచ్చి నివాసం ఉంటున్నారని దర్యాప్తు అధికారి బాలాజీ మేటే తెలిపారు. నేపాల్‌లోని ఒక గ్రామానికి చెందినవారని వెల్లడించారు. ఉపాధి కోసం మే నెల ప్రారంభంలో పూణెకు వచ్చారన్నారు. హుడాకే సోదరి కూడా వీరితోనే ఉంటుందని తెలిపారు. మద్యం మత్తులో హుడాకే ఈ దారుణానికి తెగబడ్డాడని పోలీసులు చెప్పారు. ఆమెను విపరీతంగా కొట్టి.. భయభ్రాంతులకు గురి చేసిన తర్వాత నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆమె శీలానికి స్క్రూలు, ఇత్తడి తాళాన్ని వేసినట్లు పోలీసులు తెలిపారు. సమీపంలో ఉన్న నేపాలీయులు ఆమెను రక్షించి ఆస్పత్రిలో చేర్చింపినట్లుగా పేర్కొన్నారు. ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగిందని.. శస్త్రచికిత్స తర్వాత ఆమె కోలుకుందని బాలాజీ మేటే చెప్పుకొచ్చారు. ఆమె పరిస్థితి మెరుగుపడిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిందని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Tarun: రీఎంట్రీకి సిద్దమైన తరుణ్.. తల్లి రోజా రమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
తాజావార్తలు
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
-
Kriti Sanon: రాహుల్‌గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
-
Konda Murali : కాంగ్రెస్‌ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
-
Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
-
YS Jagan: ‘సీఎంగా ఏం చేస్తున్నా’ అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..