Site icon NTV Telugu

Pulses Price: టమాటాలు, మసాలా దినుసుల బాటలోనే పప్పుల ధరలు.. కిలోకు రూ.30 పెరిగింది

Pulses

Pulses

Pulses Price: దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పచ్చి కూరగాయలు, మసాలా దినుసులతో పాటు చాలా వరకు ఆహార పదార్థాలు కూడా ఖరీదైనవిగా మారాయి. దీంతో సామాన్య ప్రజల జేబుపై ద్రవ్యోల్బణం భారం పెరిగింది. కూరగాయలు, మసాలా దినుసులతో పాటు పప్పుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం పేద ప్రజలు పప్పులు తినడం కూడా కలగానే మారుతోంది. అధిక ధరల కారణంగా చాలా మంది పప్పులు కొనడమే మానేశారు.

Read Also:Megastar Chiranjeevi : ఏంటి..చిరంజీవి చేతికి పెట్టుకున్న ఈ వాచ్ అన్ని కోట్లా..?

గత నెల రోజులుగా పప్పుల ధరలో గరిష్ట పెరుగుదల నమోదైంది. కందిపప్పు అత్యంత ఖరీదైంది. నెలరోజుల క్రితం వరకు 100 నుంచి 120 రూపాయలు పలికిన కందుల ధర ఇప్పుడు దాదాపు 200 రూపాయలకు పెరిగింది. దీంతో కందిపప్పు సామాన్య ప్రజల ప్లేట్ నుంచి కనుమరుగైంది. అయితే పెరుగుతున్న పప్పుల ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. అయినప్పటికీ ధరలు మెరుగుపడడం లేదు. గత మార్చి నుంచి పప్పుల ధరలను తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. పప్పుధాన్యాల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను పర్యవేక్షించడానికి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. వ్యాపారులు పప్పు దినుసులను బ్లాక్‌ మార్కెటింగ్‌ చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం అనుమానిస్తోంది. దీంతో మండీలకు పప్పుల రాక తగ్గి ధరలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత కమిటీ రాష్ట్ర అధికారులతో కలిసి తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది. అయినప్పటికీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం పప్పుధాన్యాల నిల్వ పరిమితిని నిర్ణయించింది.

Read Also:Lakshmi Devi Signs: ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా?.. త్వరలోనే మీ ఇళ్లు డబ్బుతో నిండిపోతుంది!

కేంద్ర ప్రభుత్వం పప్పుధాన్యాల నిల్వ పరిమితిని జూన్ 2న నిర్ణయించింది. పప్పుధాన్యాల స్టాక్ పరిమితి జూన్ 2 నుంచి అమల్లోకి వస్తుందని, ఇది అక్టోబర్ 31 వరకు కొనసాగుతుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా వ్యాపారి నిర్ణీత పరిమితికి మించి పప్పులను నిల్వ ఉంచినట్లయితే, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఈ నిబంధన టోకు వ్యాపారులు, రిటైలర్లు, మిల్లు యజమానులతో పాటు దిగుమతిదారులకు కూడా వర్తిస్తుంది. రిటైల్ వ్యాపారులు 5 టన్నులకు మించి పప్పుధాన్యాలను నిల్వ చేయరాదని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. టోకు వ్యాపారులు, దిగుమతిదారులు 200 టన్నుల కంటే ఎక్కువ పప్పులను నిల్వ చేయలేరు. ఒక రకమైన పప్పుధాన్యాల స్టాక్ 100 టన్నుల కంటే ఎక్కువ ఉండకూడదు. ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ పప్పులు ధర పెరుగుతూనే ఉన్నాయి.

Read Also:Cab Driver Extorts: ఫోన్‌లో ‘ఎఫైర్’ మాటలు విన్నాడు.. మహిళని బెదిరించి 22 లక్షలు దోచేశాడు

పప్పుల ధర కిలోకు ఇలా..
పప్పు – ఒక నెల క్రితం ధర – ప్రస్తుత ధర
కందిపప్పు – రూ. 170- 180 – రూ. 190-200
పెసరపప్పు – రూ 150-160 – 160- 180
ఎర్రపప్పు- రూ.110 – రూ.120-140
శనగపప్పు- రూ.90 – రూ. 100
మినప పప్పు – రూ.150 – రూ.160-180
పెసర పప్పు హోల్ సేల్- రూ .110-120 – రూ ..120-130

Exit mobile version