Cab Driver Extorts: ఫోన్‌లో ‘ఎఫైర్’ మాటలు విన్నాడు.. మహిళని బెదిరించి 22 లక్షలు దోచేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Cab Driver Extorts 22 lakh Gold jewelry From Woman After Overhearing Phone Conversation: బెంగళూరులో ఒక విచిత్రమైన దోపిడీ జరిగింది. ఫోన్‌లో ఒక మహిళ మాట్లాడిన ‘ఎఫైర్’ మాటలు విని.. క్యాబ్ డ్రైవర్ ఆమెను బెదిరించి, రూ.22 లక్షలు దోచేశాడు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని హర్సగట్టకు చెందిన కిరణ్ ఒక క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గతేడాది డిసెంబర్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న వివాహిత.. ఇంద్రానగర్ నుంచి బనస్వాడాకి ఒక క్యాబ్ బుక్ చేసింది. క్యాబ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో.. ఆ మహిళ తన ఫోన్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతున్న మాటల్ని విన్నాడు.
Russia Crime: దారుణం.. యువతిని 14 ఏళ్లు బంధించి, 1000 సార్లకు పైగా అత్యాచారం
Also Read
- Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
- PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
కట్ చేస్తే.. కొన్ని రోజుల తర్వాత ఆ క్యాబ్ డ్రైవర్ కిరణ్ ఆమెకు ఒక మెసేజ్ చేశాడు. తనని తాను చైల్డ్‌హుడ్ ఫ్రెండ్‌గా పరిచయం చేసుకున్న అతను.. తాను ఆర్థిక సమస్యల్లో ఉన్నానని, కొంచెం డబ్బు అవసరం ఉందని అడిగాడు. అప్పుడు ఆమె వెంటనే అతని బ్యాంక్ అకౌంట్‌కి రూ.22 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసింది. కొన్ని రోజులు గడిచాక అతడు తన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ కాదని తెలుసుకున్న ఆ మహిళ.. అతనితో మాట్లాడటం మానేసింది. కానీ.. కిరణ్ మాత్రం ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. తాను చెప్పినట్టు చేయకపోతే.. నీకు మరొకరితో ఎఫైర్ ఉందన్న విషయం నీ భర్తకు చెప్తానని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన ఆమె.. అతడు అడిగినట్లుగానే ఈ నెల ఏప్రిల్‌లో తన బంగారం (750 గ్రాములు) మొత్తం ఇచ్చేసింది.
Aashika Bhatia: అవును.. నాకు ఆ ‘పాడు’ అలవాటు ఉంది.. అమ్మకి కూడా తెలుసు
కొన్ని రోజులు గడిచాక ఇంట్లో బంగారం కనిపించకపోవడంతో.. భర్త ఆమెను నిలదీశాడు. అప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ గురించి ఆమె తన భర్తకు వివరించింది. ఆ తర్వాత ఆమె పోలీస్ స్టేషన్‌లో ఆ క్యాబ్ డ్రైవర్‌పై ఫిర్యాదు నమోదు చేసింది. తనని బెదిరించి రూ.22 లక్షలతో పాటు 750 గ్రాముల బంగారం దోచుకున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. క్యాబ్ డ్రైవర్ కిరణ్‌ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
-
New Mahindra Thar OG: కొత్త Mahindra Thar OG భారత్‌లో లాంచ్.. 2.2L డీజిల్, 2.0L టర్బో పెట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
-
Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
ట్రెండింగ్
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..