SIT Investigation: దాడి ఘటనపై విచారణకు హాజరైన పులివర్తి నాని..అధికారులతో ఏం చెప్పారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఎస్వీయూ పోలీస్ స్టేషన్ లో వర్శిటి జరిగిన దాడి ఘటనపై విచారణకు హాజరయ్యారు. అక్కడ ఆయన అధికారులతో మాట్లాడారు. “పద్మావతి వర్శిటిలో నాపై దాడికి కర్త, ఖర్మ, క్రియ మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. న్యాయం చేమాని పోలీసులను కోరాం. కుట్రతో చెవిరెడ్డి ఇలాంటి దాడులకు తెగపడడ్డారు. అనుచరులు చేజారకుండా కావాలనే ఆయన మనుషులపై కేసులు పెట్టించాడు. పోలీసులకు ఇవ్వాల్సిన ఆధారాలను ఇచ్చాను. అమాయకులను కేసులో ఇరికించారు. చంద్రగిరి ప్రశాంతంగా చూడటమే నాలక్ష్యం. రిపోలింగ్ చేస్తే… మాకే పోలింగ్ శాతం పెరుగుతుంది. ఎక్కడ గొడవలు జరగలేదు. కావాలని చెవిరెడ్డి రి పోలింగ్ అడిగినట్లు ఉన్నారు.” అని ఆయన పేర్కొన్నారు.
READ MORE: PM Modi: “నేను జీవించి ఉన్నంత వరకు అది సాధ్యం కాదు”.. రిజర్వేషన్లపై ప్రధాని మోడీ..
Also Read
కాగా.. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు చంద్రగిరిలో అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. ఏపీ పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. కేంద్ర బలగాలతో నారావారిపల్లి, శేషాపురం, భీమవరంలలో పోలీసులు మార్చ్ నిర్వహించారు. సమస్యాత్మక గ్రామాలు, ప్రాంతాల్లోని ముఖ్య కూడళ్ళల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్‌తో పాటు 30 యాక్ట్ అమల్లో ఉన్నందున ప్రజలు ఎవరు కూడా గుమికూడరాదని హెచ్చరికలు జారీ చేశారు. సభలు, సమావేశాలు, ఊరేగింపులకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. జూన్ 4 వరకు ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..