Banking Charges: సర్వీస్ ఛార్జ్ – పెనాల్టీ పేరుతో ఐదేళ్లలో బ్యాంకులు ఎన్ని వేల కోట్లు వసూలు చేశాయో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Banking Charges: ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ ఖాతాదారుల నుంచి గడిచిన ఐదేళ్లలో సర్వీస్ ఛార్జ్ – పెనాల్టీ పేరుతో రూ. 35,587 కోట్లను వసూలు చేశాయి. ఖాతాలలో కనీస నిల్వను నిర్వహించకపోవడం, అదనపు ఏటీఎం లావాదేవీలు, ఎస్ఎంఎస్ సేవల పేరుతో బ్యాంకులు పెద్దమొత్తంలో నగదును రికవరీ చేశాయి. ఈ విషయాన్ని ప్రభుత్వమే పార్లమెంట్‌లో వెల్లడించింది. ప్రశ్నోత్తరాల సమయంలో రాజ్యసభ ఎంపీ అమీ యాగ్నిక్ అడిగిన ప్రశ్నలకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ సమాధానమిచ్చారు. బ్యాంకు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయనందుకు బ్యాంకులు గరిష్టంగా పెనాల్టీ వసూలు చేశాయని చెప్పారు. 2018 తర్వాత మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించనందుకు బ్యాంకులు రూ.21,044.04 కోట్లను రికవరీ చేశాయి. అకౌంట్ హోల్డర్ల ఫిక్స్‌డ్ ఫ్రీ లావాదేవీలే కాకుండా ఏటీఎంలలో అదనపు లావాదేవీలు చేసినందుకు రూ.8289.32 కోట్లు రికవరీ అయింది. ఎస్ఎంఎస్ సేవలను అందించడానికి బదులుగా బ్యాంకులు రూ.6254.32 కోట్లను రికవరీ చేశాయి.
Read Also:Lottery: జాక్ పాట్.. లాటరీలో రూ.13వేల కోట్లు గెలుచుకున్నాడు..
Also Read
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
- India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
- SL A vs Ind A: 100వ మ్యాచ్లో శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్.. భారత్ స్కోర్ ఎంతంటే.?
పేదలకు భరించలేని విధంగా బ్యాంకులు సర్వీసు చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ ఛార్జీలపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆర్థికమంత్రిని అడిగారు. బ్యాంకుల సర్వీస్ చార్జీలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఏం చేసింది? .. అన్న ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి సమాధానమిస్తూ, దేశంలోని పేద వర్గాలకు బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం, ఆర్‌బిఐ అనేక చర్యలు తీసుకున్నాయని చెప్పారు. ప్రాథమిక సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా (BSBDA) దీనిలో ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన కింద తెరిచిన ఖాతాలపై ఎటువంటి ఛార్జీలు విధించబడవు. ఈ ఖాతాలలో కనీస నిల్వను నిర్వహించాల్సిన అవసరం లేదు. 2015 జూలై 1న బ్యాంకులో కస్టమర్ సేవలకు సంబంధించి ఆర్‌బీఐ మాస్టర్ సర్క్యులర్‌లో బోర్డు ఆమోదించిన పాలసీ ప్రకారం ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచుకోనందుకు బ్యాంకులు పెనాల్టీ విధించే అవకాశం ఉందని చెప్పినట్లు భగవత్ కరద్ తెలిపారు. జూన్ 10, 2021న, ఆర్బీఐ తన సర్క్యులర్‌లో బ్యాంక్ కస్టమర్లు తమ బ్యాంక్ ఏటీఎంలలో ప్రతి నెలా ఐదు లావాదేవీలను ఉచితంగా చేసుకోవచ్చని పేర్కొంది. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మెట్రో నగరాల్లో 3 , నాన్-మెట్రో నగరాల్లో 5 ఉచిత లావాదేవీలు అనుమతించబడతాయి. జనవరి 1, 2022 నుండి ప్రతి అదనపు ATM లావాదేవీకి రూ. 21 కస్టమర్ ఛార్జీ వసూలు చేయబడుతుంది.
Read Also:Rajini: వీకెండ్ కాదు, పండగ లేదు… సెలబ్రేషన్ మాత్రం పీక్స్ లో ఉంది
తాజావార్తలు
-
Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Morning Habit: నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
-
Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!