GST On Food Items: మైదా, బియ్యం వంటి నిత్యావసర వస్తువులపై జీఎస్టీని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జీఎస్‌టీ కౌన్సిల్ నుంచి ఎలాంటి సిఫారసు చేయలేదని పేర్కొంది. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాలు తెలిపారు.
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఖాళీ అయిన 6 రాజ్యసభ స్థానాల ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. వీటితో పాటు బీహార్లో ఒక శాసనమండలి స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. మరోవైపు పశ్చిమ బెంగాల్, ఒడిశాలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. అసోం, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 6 రాజ్యసభ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి.వాయిస్..ఈ ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ కు సెప్టెంబర్ 22 తుది…