NTV Telugu Site icon

Protest Against Somu Veerraju: సోము వీర్రాజుకు నిరసన సెగ.. ప్రత్యేక హోదా ఏది..? విశాఖ ఉక్కు సంగతేంటి?

Chirala

Chirala

Protest Against Somu Veerraju: బాపట్ల జిల్లా చీరాలలో ఆంధ్రప్రదేశ్‌, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు నిరసన సెగ తగిలింది. ఏపీకి ప్రత్యేక హోదా సంగతి ఏంటి..? విశాఖ ఉక్కు పరిస్థితి ఏంటి? విశాఖ రైల్వే జోన్‌ అంశాన్ని ఏం చేశారంటూ సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. చీరాల అభివృద్ధి సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నిరసనకారులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Read Also: Ruhani Sharma: షర్ట్ బటన్స్ విప్పి రుహానీ శర్మ అరాచకం.. తట్టుకోవడం కష్టమే సుమీ!

మరోవైపు చీరాల సభలో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజునే మోడీ ఏపీకి 24 గంటల విద్యుత్ సరఫరా ప్రకటించారని గుర్తుచేశారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని విజయవాడ ప్రాంతాన్ని మోడీ అభివృద్ధి చేశారన్న ఆయన.. ఉద్యమాలు చేస్తూ రెచ్చగొట్టే విధంగా రాష్ట్రంలో పాలన చేస్తున్నారు.. కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాలకు జగన్ స్టిక్కర్లు వేసుకొని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం అందిస్తున్న సంక్షేమం ముందు జగన్ సంక్షేమం బలాదూరన్న వీర్రాజు.. సీఎం వైఎస్‌ జగన్ అవినీతి, అప్పులు చేసి.. సంక్షేమం అందిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని కాలరాయాలని చూస్తున్నారు.. రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను జగన్ దోచుకోవాలని చూస్తున్నారు.. రాష్ట్రాన్ని దోచుకొని వేల కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారంటూ సంచలన ఆరోపణలు గుప్పించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.