Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pesara Laddu Recipe: పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వారికి రుచికరమైన, ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అంతేకాకుండా బయటి చిరుతిండి తగ్గించడానికి ఇంట్లోనే ప్రోటీన్ రిచ్ ఫుడ్ అందిస్తే అది వారికి కూడా మేలు అవుతుంది. అలాంటి వారికోసమే గ్రీన్ మూంగ్ దాల్ (పెసర్లు)తో చేసే ఈ లడ్డూలు మంచి ఎంపిక. పెసర్లలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు సమృద్ధిగా ఉండటంతో పిల్లల ఎదుగుదలకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. బెల్లం, డ్రై ఫ్రూట్స్, నెయ్యి కలిపి చేసే ఈ లడ్డూలు రుచితో పాటు పోషకాలను కూడా అందిస్తాయి. ముఖ్యంగా వీటిని ఒక నెల వరకు నిల్వ చేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు:
* పెసర్లు – 1 కప్పు
* బెల్లం – ½ కప్పు (తీపి ఎక్కువ కావాలంటే 1 కప్పు)
* నీరు – అవసరమైనంత
* నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు
* బాదం – 12
* జీడిపప్పు – 10
* కిస్మిస్ – కొద్దిగా
* యాలకుల పొడి – 1 టేబుల్ స్పూన్
* పాలు – 3 టేబుల్ స్పూన్లు
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
తయారీ విధానం:
ముందుగా ఒక కప్పు పెసర్లను తీసుకుని రెండు నుంచి మూడు సార్లు బాగా కడిగి నీరు పూర్తిగా వడకట్టాలి. తర్వాత ఒక వెడల్పాటి కడాయిలో వేసి మొదట హై ఫ్లేమ్‌పై నీరు పూర్తిగా ఆవిరయ్యే వరకు వేయించాలి. ఆ తర్వాత చిన్న మంటపై పెసర్లు మంచి సువాసన వచ్చి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి.
ఇప్పుడు మరో పాత్రలో బెల్లం, కొద్దిగా నీరు వేసి కరిగించాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత వడకట్టి మళ్లీ స్టవ్‌పై ఉంచి రెండు పొంగులు వచ్చే వరకు మాత్రమే వేడి చేయాలి. పాకం తయారు చేయాల్సిన అవసరం లేదు. అనంతరం చల్లారనివ్వాలి. చల్లారిన పెసర్లను మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే వడకట్టుకోవచ్చు. ఇప్పుడు కడాయిలో నెయ్యి వేసి బాదం, జీడిపప్పు, కిస్మిస్ను వేయించి పక్కన పెట్టాలి.
అదే కడాయిలో పెసరపిండి వేసి చిన్న మంటపై నెయ్యి మొత్తం పిండికి పట్టేలా, మంచి సువాసన వచ్చే వరకు సుమారు 15 నుంచి 20 నిమిషాలు వేయించాలి. అవసరమైతే మరికొంత నెయ్యి జోడించవచ్చు. పెసరపిండి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. తర్వాత చల్లారిన బెల్లం పాకాన్ని కొద్దికొద్దిగా పోస్తూ బాగా కలపాలి. మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతులతో లడ్డూలుగా చుట్టుకోవాలి.
ఒకవేళ మిశ్రమం చల్లారిపోయి లడ్డూలు చుట్టడానికి కష్టంగా అనిపిస్తే.. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలు వేసి మళ్లీ కలిపి లడ్డూలు తయారు చేసుకోవచ్చు. ఈ పెసర లడ్డూలను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే ఒక నెల వరకు తాజాగా ఉంటాయి. పిల్లలకు సాయంత్రం స్నాక్‌గా లేదా ఉదయం అల్పాహారంతో పాటు ఇవ్వడానికి ఇవి బెస్ట్ ఛాయిస్.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..