Site icon NTV Telugu

Rajamahendravaram: స్పా కేంద్రం ముసుగులో వ్యభిచారం.. పలువురి అరెస్ట్

New Project (21)

New Project (21)

కొందరు వ్యక్తులు ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఆడవాళ్లను బలవంతంగా వ్యభిచార కూపంలోకి లాగి డబ్బులు దండుకుంటున్నారు. భారత్ లో చాలా చోట్ల ఇలాంటి అక్రమ వ్యాపారాలు కొనసాగుతున్నాయి. అమాయకమైన అమ్మాయిలను తమ వలలో వేసుకుని వారిని తీసుకు వచ్చి వ్యభిచార ముఠాలకు విక్రయించి అందినకాడికి డబ్బును దండుకుంటున్నారు. పోలీసులు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినా కూడా అసాంఘిక కార్యకలాపాలు మాత్రం ఆగడం లేదు. బయట మసాజ్ సెంటర్ బోర్డు పెట్టి లోపల పాడు పనులకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ లాంటి నగరాకే పరిమితమైనా ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాలకు పాకుతోంది. తాజాగా రాజమండ్రి కేంద్రంగా స్పా ముసుగులో యువతులతో వ్యభిచారం చేస్తున్న మసాజ్ సెంటర్ లపై పోలీసులు దాడులు నిర్వహించారు.

READ MORE: Boiled food: ఈ ఆహారం పదార్థాలను ఉడికించి తింటే పోషకాలు మెండుగా లభిస్తాయి(WS)

నిర్వహకులతో పాటు విటులను, యువతిలను పోలీసులు వల ఫన్నీ పట్టుకున్నారు. స్పా కేంద్రం ముసుగులో యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడి చేశారు. రాజమండ్రి ఏవీ అప్పారావు రోడ్డులో జిమ్ తోపాటు స్పా, కేంద్రం నిర్వహిస్తున్నారు. ఇందులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ముగ్గురు యువకులు, ముగ్గురు యువతులను అరెస్టు చేశారు. స్పా సెంటర్ నిర్వహకుడు రవి పరారీలో ఉన్నాడు ‌. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజమండ్రి ప్రకాష్ నగర్ ఎస్.ఐ. రవిశంకర్ తెలిపారు.

Exit mobile version