పోషకాహారంలోనూ, సమతుల ఆహారంలోనూ గుడ్లకు తప్పకుండా స్థానం ఉంటుంది.
అయితే కొందరు గుడ్లను పచ్చిగానే తింటారు. కానీ గుడ్లను ఉండికించిన తరువాత తింటే పోషకాలు మెండుగా ఉంటాయి.
బంగాళదుంప వంటల్లో విరివిగా ఉపయోగించబడుతుంది. వీటిని ఎన్ని విధాలుగా వండినా వీటి రుచి బావుంటుంది.
బంగాళదుంపలను వేపుళ్లు, డీప్ ఫ్రై లు కాకుండా వాటిని ఉడకబెట్టి వండుకుని తింటే రెట్టింపు పోషకాలు లభిస్తాయి.
బీన్స్, పప్పులు, శనగలు మొదలైన వాటిలో పోషకాలు సూపర్ గా ఉంటాయి.
ఉడికించి వివిధ రకాల వంటకాల రూపంలో తీసుకుంటే శరీరానికి మేలు.
చిలకడదుంపలలో బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-ఇ ఉంటాయి.
ఉడికించి తింటే రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో ఇది చక్కగా పనిచేస్తుంది.
ఆకుపచ్చ కూరగాయలలో బ్రోకలీ చాలా ప్రయోజనకరమైనది.
ఇందులో మంచి మొత్తంలో విటమిన్-సి, ఫోలెట్, కరికే ఫైబర్ ఉంటుంది.
బ్రోకలీని ఉడికించి తింటే శరీరానికి సమృద్దిగా పోషకాలు లభిస్తాయి.