Editor Madhu Reddy: చిన్న వయసులోనే దూరమైన ప్రతిభావంతుడు.. గుండెపోటుతో ప్రముఖ ఎడిటర్ కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరీంనగర్‌కు చెందిన ప్రముఖ ఎడిటర్ మధు రెడ్డి హైదరాబాద్‌లోని మణికొండలో ఏప్రిల్ 18న గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సహచరులు, స్నేహితులు, ఆయనతో కలిసి పనిచేసిన సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి, దుఃఖానికి లోనయ్యారు.
ఎడిటర్‌గా మధు రెడ్డికి ఇండస్ట్రీలో మంచి పేరుంది. సినిమాలోని ఎమోషన్, రిథమ్, నరేటివ్ ను అర్థం చేసుకొని ఎడిటింగ్ చేయడంలో ఆయనకు మంచి పట్టు ఉంది. ‘దళం’, ‘దక్ష’, ‘అహ నా పెళ్ళంట’, ‘జగమేమాయ’, ‘వాలెంటైన్స్ నైట్’ వంటి చిత్రాలతో పాటు, త్వరలో విడుదల కానున్న ‘అగ్ని నక్షత్రం’ లాంటి సినిమాలు ఆయన పనితీరును, కథను పర్ఫెక్ట్గా ప్రెజెంట్ చేసే విధానాన్ని తెలియజేస్తాయి.
Also Read
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
- Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
- Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
కేవలం ఫీచర్ ఫిలిమ్స్‌కు మాత్రమే కాదు.. ఆయన వందలాది చిత్రాలకు ట్రైలర్ ఎడిటర్‌గా కూడా పనిచేశారు. ‘జగడం’, ‘జల్సా’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల ట్రైలర్స్ కట్ చేసింది ఆయనే. ఆ ట్రైలర్స్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచడంలో ఆయన ఎడిటింగ్ మార్క్ ఎంతో ఉంది. తన వృత్తి పట్ల ఎంతో అంకితభావం, ఎప్పుడూ ఒదిగి ఉండే మనస్తత్వం మధు రెడ్డి సొంతం. ఆయన వర్క్‌లో ఎప్పుడూ ఒక స్పష్టత, సినిమాకు కావాల్సిన సరైన పెసింగ్ కనిపిస్తాయి.
మధు రెడ్డి ఆకస్మిక మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. సొంత ఊరు కరీంనగర్ నుండి వచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. భౌతికంగా మన మధ్య లేకపోయినా తన సినిమాల ద్వారా ఎప్పటికీ గుర్తుండిపోతారు.
తాజావార్తలు
-
Vivo X500 Series: సెప్టెంబర్‌లో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు.. 200MP కెమెరా, 4K 240fps వీడియోతో అదరగొట్టనున్న వివో!
-
IRUMUDI : టికెట్ల అమ్మకాల్లో పెద్దిని దాటిన ‘ఇరుముడి’
-
Shivalayam Movie: రంగస్థలం ఫేమ్ ఆచంట మహేష్ హీరోగా ‘శివాలయం’ మూవీ!
-
Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.1.63 లక్షలు దాటిన గోల్డ్ ధర
-
Shoriful Islam History: 140 ఏళ్లలో ఇదే తొలిసారి.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ స్టార్!
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..