Heart Attack: గుండెపోటుతో విజయవాడలో ప్రముఖ కార్డియాలజిస్ట్ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heart Attack: విజయవాడలో ప్రముఖ హృద్రోగ వైద్య నిపుణుడు గుండెపోటుతో మృతి చెందారు. రమేష్ కార్డియాక్ హాస్పటల్స్‌లో సుదీర్ఘ కాలంగా కార్డియాలజీ సర్జన్‌గా పేరొందిన డాక్టర్ పాటిమళ్ల శ్రీనివాస ప్రసాద్ మంగళవారం రాత్రి అనూహ్యంగా సైలెంట్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. వైద్యులైన శ్రీనివాస్ దంపతులు సుదీర్ఘ కాలంగా వైద్యులుగా గుర్తింపు పొందారు.
డాక్టర్ శ్రీనివాస్ గుండె జబ్బుల వైద్యుడిగా కోస్తా జిల్లాల్లో గుర్తింపు పొందారు. కార్డియాక్ సర్జన్‌గా ఎంతో మందికి చికిత్సలు చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రులకు వచ్చే వారిని శస్త్ర చికిత్సలతో ప్రాణాలు కాపాడారు. గుండె సమస్యలు తలెత్తే విధానం గురించి రోగులకు అర్థమయ్యేలా వివరించే వారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం వచ్చే ఎంతోమందికి చివరి నిమిషాల్లో ప్రాణాలు నిలబెట్టారు. ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టిన విజయవాడ రమేష్ హాస్పటల్లో సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ అనూహ్యంగా ప్రాణాలు కోల్పొవడం వైద్యుల్ని కలిచి వేసింది.
Also Read
- Mamidikaya Pappucharu: 'మామిడికాయ పప్పుచారు' ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
- KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
- Pawan Kalyan: ప్రెస్‌మీట్‌కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
పాతికేళ్లకుపైగా వేలాది మందికి బైపాస్ శస్త్ర చికిత్సలు చేశారు. కోస్తా జిల్లాల్లో హృద్రోగ నిపుణులు పెద్దగా లేని సమయంలో జిల్లాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి వ్యాధులను గుర్తించి వైద్యాన్ని సూచించేవారు. తీవ్రమైన గుండె సమస్యలు ఉన్న వారికి బైపాస్ సర్జరీలను సమర్ధవంతంగా నిర్వహించారు. సోమవారం భార్యతో కలిసి హైదరాబాద్ నుంచి కారులో విజయవాడ వచ్చిన ఆయన అర్థరాత్రి దాటాక సైలెంట్ స్ట్రోక్‌తో ప్రాణాలు కోల్పోయారు.
డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ నగరంలోని గాంధీ నగర్‌లో సాయంత్రం పూట కార్డియాలజి క్లినిక్ సైతం నిర్వహించే వారు. కోవిడ్ నుంచి సొంత క్లినిక్ నడపడం ఆపేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత గుండెపోటుకు గురయ్యారు. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఫ్రిడ్జిలో వాటర్ బాటిల్ తెచ్చుకుంటానని హాల్లోకి వెళ్లిన ఆయన చాలా సేపటి వరకు లోపలకు రాలేదు. సైలెంట్ కార్డియాక్ అరెస్ట్‌కు గురి కావడంతో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు. చాలా సేపటి వరకు డాక్టర్ శ్రీనివాస్ బెడ్‌రూమ్ లోపలకు రాకపోవడంతో బయటకు వచ్చి చూసిన భార్యకు ఆయన అపస్మారక స్థితిలో పడి ఉండటం గమనించారు.
డాక్టర్ శ్రీనివాస్ గుండెపోటుకు గురైనట్టు గుర్తించిన ఆయన సతీమణి వెంటనే సీపీఆర్ చేశారు. అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. భార్య ఇద్దరు కుమార్తెలున్నారు. చిన్న కుమార్తె నెదర్లాండ్స్ నుంచి బుధవారం వచ్చిన తరు వాత అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
కార్డియాలజిస్ట్‌గా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వేలాది మందికి శ్రీనివాస్ సేవలందించారు. ఆయన కుటుంబంలో పలువురు కార్డియాలజీ నిపుణులు ఉన్నారు. భార్య, అల్లుడు, వియ్యంకులు అంతా వైద్యులే ఉన్నా చివరి వరకు సైలెంట్ స్ట్రోక్‌ను ఎవరు గుర్తించలేకపోయారు. శ్రీనివాస్ గతంలో రోజుకు గంటపాటు వ్యాయామం చేసే వారని, ప్రస్తుతం రోజూ గంట పాటు వాకింగ్ చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఎటువంటి అలవాట్లు లేని ఆయన రోజుకు 70-80 మంది రోగులను చూసి వైద్యం అందిస్తారు. తనకు ముంచుకొచ్చిన ముప్పును మాత్రం గుర్తించలేకపోయారని సహచర వైద్యులు విచారం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Bihar: 1992 నాటి కేసు.. 34 ఏళ్ల తర్వాత తీర్పు.. 84 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చిన కోర్టు
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
Psychology Facts: ప్రతి పనికీ 10నిమిషాలు ముందుగా వచ్చే వ్యక్తులు గురించి షాకింగ్ ఫ్యాక్ట్.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
-
Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
-
Samsung: సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8, ఫోల్డ్ 8 అల్ట్రా డిజైన్ లీక్.. 200MP కెమెరాతో రానున్నాయా?
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!