Site icon NTV Telugu

Tollywood Bundh : ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ తో టాలీవుడ్ నిర్మాతల భేటీ

Tollywood (1)

Tollywood (1)

గత కోద్ది రోజులుగా టాలీవుడ్ లో బంద్ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. తమకు 30 % వేతనాలు పెంచాలన్న కార్మిక సంఘాల డిమాండ్ కు నిర్మాతలు ససేమిరా అన్నాడంతో ఈ వివాదం మోదలైంది. దాంతో షూటింగ్స్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కాగా ఇప్పుడు ఈ వ్యవహారం ఆంధ్ర కు షిఫ్ట్ అయింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఏపి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు సమావేశం కానున్నారు.

Also Read : Jr.NTR : వార్ 2 ఈవెంట్ లో ఎన్టీఆర్ ధరించిన వాచ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు

సినిమా కార్మికుల సమస్యలు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయాలకు సంబంధించిన విషయాలను, ప్రస్తుతం ఉన్న పరిస్థితి, కార్మికుల ఎజెండా పరిశ్రమ నుంచి స్పందన ఈ అంశాలపై చేర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తో ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ సభ్యులు సమావేశం కానున్నారు. నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో 14 మంది సభ్యుల బృందం నేడు అమరావతి పయనమవుతున్నారు. వీరిలో ప్రముఖ నిర్మాతలు కేఎల్ నారాయణ,  మైత్రి రవి శంకర్, టీ జి. విశ్వ ప్రసాద్, దిల్ రాజు, నాగ వంశీ, సాహు గారపాటి, భరత్ భూషణ్, స్వప్నా దత్, యూవీ వంశీ, వివేక్ కూచిభొట్ల, దానయ్య, BVSN ప్రసాద్,  బన్నీ వాసు ఉన్నారు. కందుల దుర్గేష్ తో సమావేశం ముగిసిన తర్వాత జనసేన కార్యాలయానికి వెళ్లాలని భావిస్తున్నారట. సినీ పరిశ్రమ తరపున పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు కూడా తాజా పరిణామాలపై రిప్రెజెంటేషన్ ఇవ్వనున్న సినీ ప్రముఖులు. ఒక వేళ పవన్  అందుబాటులో లేకుంటే పరిస్థితిని బట్టి ఫోన్ లో మాట్లాడే ఆలోచన చేస్తున్నారట.

Exit mobile version