Site icon NTV Telugu

Naga Vamsi: నా క్రష్ ఆ హీరోయినే.. ఓపెన్ అయిన ప్రొడ్యూసర్ నాగవంశీ

Naga Vamsi

Naga Vamsi

Naga Vamsi: టాలీవుడ్‌లో ప్రొడ్యూసర్ నాగవంశీ అంటే తెలియని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన స్పీచ్‌లకు యూత్‌లో అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ ప్రొడ్యూసర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఈ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారు, ఆయన ఓపెన్ అయిన ఆ హీరోయిన్ క్రష్ ఎవరు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: New Year’s Day 2026: కొత్త సంవత్సరం రోజు ఈ తప్పులు చేయొద్దు.. ఏడాది పొడవునా చిక్కుల్లో పడొద్దు..!

ప్రొడ్యూసర్ నాగవంశీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అక్కడ ఆయనను మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అనేదాని గురించి ప్రశ్న అడగ్గా.. దానికి ఆయన స్పందిస్తూ.. తనకు ఎప్పుడూ హీరోయిన్ పూజా హెగ్డే అంటే ఇష్టమని అన్నారు. అలాగే తనకు హీరోయిన్ రష్మిక మందన్నా అంటే కూడా ఇష్టమని చెప్పారు. ప్రస్తుతానికి తన క్రష్ ఎక్కువగా మృణాల్ ఠాకూర్ అని ఓపెన్ అయ్యారు. లాస్ట్ టైం ఈ ప్రొడ్యూసర్ హీరో విజయ్ దేవర కొండ నటించిన ‘కింగ్డమ్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం నాగవంశీ నిర్మాతగా నవీన్ పొలిశెట్టి హీరో ‘అనగనగా ఒక రాజు’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

READ ALSO: Bangladesh: బంగ్లాదేశ్‌లో ఈ పార్టీ కింగ్ మేకర్ కాబోతుందా?

Exit mobile version