మీ కళ్ల కింద నల్లటి వలయాలను పోగొట్టుకునేందుకు ఇంట్లోనే అనేక చిట్కాలను అనుసరించవచ్చు.. ఇంటి నివారణలు వీటిని తొలగించేందుకు బాగా పని చేస్తాయి. ప్రధానంగా క్రింద డార్క్ సర్కిల్స్ అనేక కారణాల వల్ల వస్తాయి. కంటినిండా నిద్ర లేకపోవడం, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, ఫోన్ ను ఎక్కువ సేపు చూడటం, డీహైడ్రేషన్, ధూమపానం లాంటి కారణాల వల్ల కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు వస్తాయి.
Read Also: Rana Daggubati: రజినీ సినిమాలో రానా.. అదిరిపోయే కాంబో.. ?
కంటి సమస్యలకు పరిష్కార మార్గాలు.. కళ్ళ చుట్టూ నీడలు కనిపించకుండా నిరోధించడానికి ప్రతి రాత్రి కనీసం ఏడు గంటలు నిద్రించేందుకు ప్రయత్నించండి.. రాత్రిపూట కళ్ళ క్రింద ద్రవం పేరుకుండా నిరోధించడానికి.. తల క్రింద దిండులతో పైకి ఎత్తాలి.. ఇది కంటి క్రింద ఉబ్బరం రాకుండా సహాయపడుతుంది. విస్తరించిన రక్త నాళాలు కుంచించుకుపోకుండా కళ్ళకు చల్లదనాన్ని అందించాలి.. దీని వల్ల ఉబ్బిన కనురెప్పలను, డార్క్ సర్కిల్స్ ను తగ్గించవచ్చు.. అలాగే కళ్లపై దోసకాయ ముక్కలను ఉంచుకోవాలి.. దోసకాయల్లో నీరు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.. కాబట్టి ఇది ఉబ్బరం తొలగించటంలో సహాయపడుతుంది.
Read Also: Nara Lokesh Delhi Tour: ఢిల్లీకి నారా లోకేష్.. విషయం ఇదేనా..?
చల్లని టీ బ్యాగ్‌లను కళ్ల కింద ఉంచుకోవాలి.. టీలో కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నందున ఇది ప్రసరణను పెంచుతుంది.. కంటి చుట్టూ మసాజ్ చేసే ఫేషియల్స్ సర్క్యులేషన్ మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుంది. డార్క్ సర్కిల్‌లను కవర్ చేయడానికి మీ చర్మం రంగును మిళితం చేయడానికి అండర్ ఐ కన్సీలర్, మేకప్ ఫౌండేషన్ వినియోగించండి.
Read Also: Karnataka: 20 సంవత్సరాల క్రితం దొంగతనం.. ఎట్టకేలకు చిక్కాడు
ఎండలోకి వెళ్ళే టైంలో ముఖంపై, ముఖ్యంగా కళ్ళ చుట్టూ సన్‌స్క్రీన్‌ను వ్రాయటం మర్చిపోవద్దు అని కండి వైద్యులు తెలియజేస్తున్నారు. సన్ గ్లాసెస్ తప్పనిసరిగా ఉపయోగించాలని సూచిస్తున్నారు. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవటానికి ఆరోగ్యకరమైన మార్గాలను కనుగొనాలి.. స్వీయ-సంరక్షణ కోసం టైం కేటాయించుకోవాలని తెలిపారు. అతిగా మద్యం సేవించడం వల్ల రక్త ప్రసరణ తగ్గుతుంది.. ధూమపానం, పొగాకు వినియోగించడం వెంటనే మానేయండి.. ధూమపానం మీ చర్మం ద్వారా వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం వ్యాప్తి చేస్తుంది.