Rahul Gandhi: ప్రియాంకకు ముద్దు పెట్టిన రాహుల్ ఫోటో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కన్యాకుమారి నుంచి కాశీ వరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఉత్తర ప్రదేశ్లోకి ప్రవేశించింది. భారత్ జోడో యాత్రలో ఇవాళ ఆయన సోదరి, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ప్రియాంకాగాంధీ, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత ఫరూఖ్ అబ్దుల్లా భాగస్వాములయ్యారు. ఈ మధ్యాహ్నం రాహుల్‌గాంధీ యాత్ర ఢిల్లీ నుంచి యూపీలోకి ప్రవేశించగానే అక్కడి కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. అనంతరం ప్రియాంకాగాంధీ, ఫరూఖ్ అబ్దుల్లా రాహుల్‌గాంధీని కలిసి యాత్రలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఫరూఖ్ అబ్దుల్లాను రాహుల్‌గాంధీ గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. అలాగే సోదరి ప్రియంకగాంధీకి రాహుల్ ముద్దు పెట్టారు. ఆత్మీయతను చాటే ఆ ముద్దు ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Read Also: World tallest man : ప్రపంచంలోని పొడవైన వ్యక్తి.. ఎత్తు కొలవాలంటే స్టూల్ ఎక్కాల్సిందే
Also Read
రాహుల్ గాంధీ బీజేపీ పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేయడమే లక్ష్యంగా గత సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర చేపట్టారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్న రాహుల్‌గాంధీ దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే తన యాత్రను పూర్తి చేసుకున్నారు. ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీలో కూడా రాహుల్ యాత్ర పూర్తయ్యింది. ఇవాళే ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించింది.
National Conference leader Farooq Abdullah joined the 'Bharat Jodo Yatra' in Uttar Pradesh.
(Pic Source: AICC) pic.twitter.com/b1GisEdrch
— ANI (@ANI) January 3, 2023
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!