Priyanka Gandhi: హోటల్‌లో దోసెలు వేసిన ప్రియాంకగాంధీ.. స్వయంగా పిండి కలిపి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Gandhi: మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలు ప్రచార జోరును పెంచాయి. ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఇవాళ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక హోటల్‌లో ఆమె సందడి చేశారు. మైసూరులోని మైలారి అగ్రహార రెస్టారెంట్‌కు వెళ్లిన ప్రియాంక.. ఆ రెస్టారెంట్‌లోని కిచెన్‌లోకి వెళ్లి తన దోసెలు చేశారు. స్వయంగా పిండిని కలిపి.. గుండ్రటి దోసెలు వేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా దోసెలు చేస్తున్న వీడియో బుధవారం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్న ప్రియాంక, “ఈ ఉదయం లెజెండరీ మైలారి రెస్టారెంట్ యజమానులతో కలిసి దోసెలు చేయడం ఆనందించానని ఆమె తెలిపారు. నిజాయితీ, కష్టపడి పనిచేయడం వ్యాపారానికి చాలా ముఖ్యమని చెప్పుకొచ్చారు.
Read Also: Delhi Mayor Election: ఢిల్లీ మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్.. నామినేషన్ విత్‌డ్రా చేసుకున్న బీజేపీ..
Also Read
- Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
- Mustard Oil Ban in US: భారత్‌లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
- iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
- Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్‌తో సూపర్ టేస్టీ కూర..
Enjoyed making dosas with the legendary Myalri Hotel owners this morning….what a shining example of honest, hard work and enterprise.
Thank you for your gracious hospitality.
The dosas were delicious too…can’t wait to bring my daughter to Mysuru to try them. pic.twitter.com/S260BMEHY7— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 26, 2023
ప్రియాంక గాంధీవెంట కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, ఏఐసీసీ కర్ణాటక ఇన్‌ఛార్జ్ రణదీప్ సుర్జేవాలా సహా పలువురు అగ్ర నేతలు కూడా హోటల్‌లో ఉన్నారు. ప్రియాంక రాకను చూసి హోటల్ సిబ్బంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రియాంకను ఆహ్వానిస్తూ.. ఆమె దోశలు వేయడాన్ని ఆసక్తిగా తిలకించారు. దోసెలు వేసిన తర్వాత రెస్టారెంట్‌కు వచ్చిన కస్టమర్లతో ప్రియాంక గాంధీ మాట్లాడారు. చిన్నారులతో కలిసి సరదాగా మాట్లాడారు. తర్వాత కాంగ్రెస్ నాయకులు అదే హోటల్‌లో టిఫిన్ చేశారు. ప్రియాంక సహా నేతలంతా ఇడ్లీలు ఆరగించారు. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది.
Perfect dosas are just the beginning; with such skillful hands, there's no limit to the power they can bring to the world. pic.twitter.com/qsgUw6IBeJ
— Congress (@INCIndia) April 26, 2023
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ మైసూరులో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా రాష్ట్రంలో తరచుగా ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. బీజేపీ సర్కారు లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్‌కు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనుండగా.. మే 13న ఫలితాలు రానున్నాయి.
తాజావార్తలు
-
OG 2: పవన్ కళ్యాణ్ సరసన బుట్టబొమ్మ?.. పూజా హెగ్డేకు భారీ కమ్‌బ్యాక్ దక్కిందా?
-
Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
-
Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!