NTV Telugu Site icon

Priyanka Gandhi: బీజేపీ వల్లే లక్షలాది మంది యువత భవిష్యత్తు నాశనమైంది..

Priyanka

Priyanka

Priyanka Gandhi: యూజీసీ నెట్, నీట్ పేపర్ లీక్ వ్యవహారం రోజురోజుకూ తీవ్ర వివాదానికి దారి తీస్తుంది. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ కావడంతో యూజీసీ నెట్ పరీక్షను కూడా ఎన్టీఏ రద్దు చేసింది. ఈ విషయంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించింది. బీజేపీ పాలనలో లక్షలాది మంది యువత భవిష్యత్త్ నాశనం అయిందని ఆరోపించింది. ఈ లీకేజీ కుంభకోణంలో 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష స్కామ్ కి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన తెలియజేస్తుందని ప్రియాంక గాంధీ అన్నారు.

Read Also: Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత..!

ఇక, బీజేపీ హయాంలో రిక్రూట్‌మెంట్‌లో అవినీతి, పేపర్ లీక్‌లు, ఎడ్యుకేషన్ లో స్కామ్‌లు జరిగడంతో.. దేశ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తున్నాయని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఈ అవినీతిని వెంటనే ఆపాలి.. తక్షణమే 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరిగేలా నీట్ పరీక్షలో జరిగిన కుంభకోణంలోని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక, ఎక్స్ వేదికగా పేపర్ లీక్ గురించి ప్రియాంక గాంధీ మరొక పోస్ట్ చేశారు. గత ఐదేళ్లలో దేశంలో 43 రిక్రూట్‌మెంట్ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయి.. బీజేపీ పాలనలో, పేపర్ లీకులు మన దేశ జాతీయ సమస్యగా మారింది.. ఇది ఇప్పటి వరకు కోట్లాది యువత భవిష్యత్తును నాశనం చేసిందన్నారు.

Read Also: Andhra Pradesh: తెలుగు సినిమా రంగాన్ని ఏపీకి తరలించడం సాధ్యమా?

అయితే, ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన దేశం భారత్.. మన దగ్గర అత్యధిక యువతతో కూడిన జనాభా ఉంది అని ప్రియాంక గాంధీ తెలిపారు. ఈ యువతను నైపుణ్యం, సమర్థులుగా మార్చే బదులు బీజేపీ ప్రభుత్వం వారిని బలహీనపరుస్తోంది అని ఆరోపించింది. నీట్ పరీక్ష మే 5న నిర్వహించబడింది.. ఇందులో సుమారు 24 లక్షల మంది విద్యార్థులు ఎక్జామ్ రాశారు.. అయితే జూన్ 4న ఫలితాలు వెలువడిన తర్వాత పేపర్ లీక్ అయిందనే ఆరోపణలు వచ్చాయి.