టాలీవుడ్లో సీనియర్ హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రియమణి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే..ఈమె వరుసగా కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. తాజాగా ఒక సినిమా షూటింగ్ సమయంలో సరైన వాష్ రూమ్స్ లేక తాను ఎంతలా కష్టపడిందో చెప్పుకొచ్చారు.ప్రియమణి ‘ఎవరే అతగాడు’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.. అలాగే తమిళంలో ‘కంగళ్ కైదు సెయ్’చిత్రంతో అక్కడి ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.. అలా కొన్నేళ్ల పాటు తమిళ, మలయాళ, తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్నా కానీ ప్రియమణికి సరైన బ్రేక్ రాలేదు. ఎక్కువశాతం మూవీస్ అన్నీ యావరేజ్ హిట్గానే నిలిచాయి. అప్పుడే కార్తీ హీరోగా తెరకెక్కిన ‘పరుతివీరన్’ సినిమాలో ప్రియమణి నటించింది.
ఈ మూవీ తో తన కెరీర్ మలుపు తిరిగింది. ఇక తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో ‘పరుతివీరన్’ కోసం తాను ఎంత కష్టపడిందో బయటపెట్టారు ఈ భామ.‘‘2006లో ‘పరుతివీరన్’మూవీ చేస్తున్నప్పుడు క్యారవ్యాన్ లాంటివి ఏమీ లేవు. అప్పుడు చాలా కష్టంగా అనిపించింది. మధురైలో షూటింగ్ జరిగింది. దాంతో పాటు తమిళనాడులోని కొన్ని పల్లెటూళ్లలో షూట్ చేశాం. అక్కడ ఉండేవాళ్ల ఇళ్లకు వెళ్లి రెస్ట్ రూమ్ ఉపయోగించాల్సి వచ్చింది. అలా కాకపోతే ఓపెన్ గా వెళ్లాల్సి వచ్చేది’’ అని ఆమె తెలిపారు.. ‘పరుతివీరన్’ అనేది కార్తీ కెరీర్లో మొదటి చిత్రం. 2007లో విడుదలయిన ఈ సినిమా ఓ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇలాంటి ఒక కాంట్రవర్షియల్ కథలో అద్భుతంగా నటించినందుకు ప్రియమణికి నేషనల్ అవార్డ్ కూడా దక్కింది. కార్తీ కూడా మంచి నటుడిగా రానించాడు.