ఆ మజా వేరు.. ప్రెజర్ వుంది.. హనుమాన్ కన్నా ముందే డార్లింగ్ : హీరో ప్రియదర్శి ఇంటర్వ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyadarshi Pulikonda Interview for Darling Movie: ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఎంటర్టైనింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది. డార్లింగ్ జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో హీరో ప్రియదర్శి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
కమెడియన్ గా మొదలై సీరియస్ కథలు చేస్తూ డార్లింగ్ తో వస్తున్నారు.. ఎలా అనిపిస్తుంది ?
-ఐ ఫీల్ వెరీ హ్యాపీ. కంటెంట్ కి మంచి రోజులు వచ్చాయని భావిస్తాను. కొత్త కథలు, వినూత్నమైన ఆలోచనలని ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. మల్లేశం, బలగం, సేవ్ ది టైగర్స్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే… ఫ్యామిలీ డ్రామాకి ఎప్పుడూ స్పేస్ వుందని నిరూపించాయి. ఫ్యామిలీ డ్రామాలు ఇండియన్ సొసైటీలో ఎవర్ గ్రీన్. నటుడిగా నేర్చుకోవడానికి ఎంతో అవకాశం దొరుకుతుంది. రిలేట్ చేసుకునే కథలు చెప్పడంలో మజా వేరుగా ఉంటుంది.
Also Read
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
- Hanuman Ansh : 'హనుమాన్ అంశ్'చూడాలన్న తెలుగు ఆడియన్స్ కల తీరుతుందా?
- The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. 'ది పారడైజ్' బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
డార్లింగ్ ఛాలెజింగ్ గా అనిపించిందా?
-జనరల్ గా మ్యారేజ్ ని చాలా స్టీరియోటిపికెల్ అప్రోచ్ లో చూస్తాం. డార్లింగ్ విషయానికి వస్తే.. విమన్ క్యారెక్టర్ స్ప్లిట్ పర్సనాలిటీ అనే స్పెషల్ కండీషన్ ఉంటుంది. దాన్ని ప్రజెంట్ చేసిన తీరు చాలా వైవిధ్యంగా ఉంటుంది. రెండు క్యారెక్టర్ లు సీరియస్ గా బాధపడుతుంటే ప్రేక్షకుడికి నవ్వొస్తుంది. డార్క్ కామెడీలో వున్న మ్యాజిక్ ఇది. డార్లింగ్ లో అది చాలా అద్భుతంగా ఎక్స్ ఫ్లోర్ చేశాం.
కంటెంట్ పిక్ చేయడానికి మీకు టీం ఉందా?
-లేదండీ. స్క్రిప్ట్ ఛాయిస్ నాదే. స్క్రిప్ట్ క్లియర్ గా చదువుతాను. కొన్నిసార్లు డౌట్స్ ఉన్నప్పుడు రాహుల్, విష్ణు, నా మెంటర్ సీతారాంతో చర్చిస్తాను. సీతారాం డార్లింగ్ కి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా చేశారు.
నభా నటేష్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
-నభా లాంటి యాక్టర్ తో నేనెప్పుడూ పని చేయలేదు. నాలాంటి యాక్టర్ తో తనూ ఎప్పుడూ వర్క్ చేయలేదు. మా ఇద్దరి పెయిరింగ్ చాలా ఫ్రెష్ గా ఉందని చాలా మంది అన్నారు. ఆనంద్ సామి అనే యాక్టింగ్ ట్రైనర్ తో ఒక వర్క్ షాప్ చేశాం. 15 రోజుల పాటు ప్రతిరోజు స్కూల్ కి వెళ్లి నేర్చుకున్నట్లు మంచి ఎక్స్ పీరియన్సు అది. ఇందులో నా క్యారెక్టర్, నభా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా వుంటాయి.
ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ లో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
-మేము కథ తీసుకువెళ్లే సమయంలో హనుమాన్ ప్రోమో బయటికి వచ్చింది. డార్లింగ్ స్టార్ట్ అయ్యే సమయానికి హనుమాన్ ఫుల్ పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తోంది. డార్లింగ్ ని చేయాలని నిర్ణయం ముందే తీసుకున్నారు. నిరంజన్ గారు, చైతన్య గారు ట్రూ డార్లింగ్స్. ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.
డైరెక్టర్ అశ్విన్ రామ్ గురించి ?
సందీప్ కిషన్ ‘ఏ వన్ ఎక్స్ ప్రెస్’ షూటింగ్ సమయంలో ఫస్ట్ టైం అశ్విన్ ని కలిశాను. తాను ఈ కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. అశ్విన్ మంచి లీడర్షిప్ క్వాలిటీస్ , కమ్యూనికేషన్ స్కిల్, క్లియర్ విజన్ ఉన్న దర్శకుడు. రానున్న రోజుల్లో పెద్ద డైరెక్టర్ అవుతాడు.
డార్లింగ్ టైటిల్ పెట్టడం ప్రెషర్ అనిపించిందా ?
-ప్రెజర్ వుంది. అయితే స్క్రిప్ట్ మీద నమ్మకం వుంది. ఈ సినిమాకి పర్ఫెక్ట్ టైటిల్ ఇది. డార్లింగ్ అనే టైటిల్ చాలా ప్రేమతో పెట్టాం.
నాని గారిలాగే మీరు కూడా డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఎంచుకుంటారు కదా ఆయన ప్రభావం మీపై ఎంత వరకు వుంది ?
– దసరా లాంటి మాస్ మసాలా సినిమా చేసిన తర్వాత హాయ్ నాన్న లాంటి సినిమా చేయడం మామూలు విషయం కాదు. నాని అన్న ప్రేక్షకులకు డిఫరెంట్ జోనర్స్ లో డిఫరెంట్ కథలు చెప్పాలని ప్రయత్నిస్తుంటారు. ఇది చాలా ఇన్స్ప్రెషనల్ గా అనిపిస్తుంటుంది.
-హాయ్ నాన్న సినిమా షూటింగ్ సమయంలో జగదీశ్ రాసిన కథ సరదాగా చెప్పాను. కథ విన్న వెంటనే సినిమా చేస్తున్నాం, షూటింగ్ ఎప్పుడు పెట్టుకుందాం అన్నారు
వివేక్ సాగర్ మ్యూజిక్ గురించి ?
– మేము ఫ్రెండ్స్ గా కలిసి పెరిగాం. వివేక్ సాగర్ కి ఇది 25వ సినిమా. బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు, తన గ్రోత్ చూస్తున్నప్పుడు ఆనందంగా ఉంటుంది.
డార్లింగ్ లో డాన్స్ కూడా చేసినట్లు ఉన్నారు ?
-నాకు తెలీదు నేను చేస్తానని. (నవ్వుతూ).ఈ క్రెడిట్ అంతా వివేక్ సాగర్, విజయ్ పోలాకి మాస్టర్, సెట్ డిజైన్ చేసిన గాంధీ కి దక్కుతుంది.
ఆడియన్స్ ని థియేటర్స్ లో రప్పించడానికి డార్లింగ్ లో ఎలాంటి అంశాలు ఉన్నాయి ?
-ఏడాదికి వంద సినిమాలు వస్తే థియేటర్స్ లో చూసి గుర్తుపెట్టుకుని నవ్వుకునే సినిమాలు నాలుగు వున్నాయి. డార్లింగ్ కూడా అలా గుర్తుపెట్టుకొని నవ్వుకునే సినిమా అవుతుంది. డార్లింగ్ లో కావల్సినంత కామెడీ వుంది, మంచి మ్యూజిక్ వుంది. డార్లింగ్ తప్పకుండా ఆడియన్స్ కి మంచి ఎక్స్ పీరియన్సు ఇస్తుంది. దాన్ని ఎంజాయ్ చేయడానికి ఆడియన్స్ థియేటర్స్ కి రావాలని కోరుకుంటున్నాను.
కొత్త సినిమాల గురించి ?
ఆగస్ట్ 15న 35 చిన్న కథ కాదు వస్తోంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో ఓ సినిమా చేస్తున్నా. వైజయంతి మూవీస్ లో రోషన్ తో ఓ సినిమా వుంది. సేవ్ టైగర్స్ సీజన్ 3 కూడా చేయాలి.
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 25 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!