అమెరికాలో (US Plane Crash) విషాదం చోటుచేసుకుంది. ఐదుగురితో వెళ్తున్న ఓ విమానం హైవేపై కూలిపోయింది. దీంతో ఇద్దరు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘోరం ఫ్లోరిడాలో ( Florida) జరిగింది. ఇంజిన్ ఫెయిల్యూర్ కావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు పైలెట్ ప్రయత్నించాడు. కానీ అంతలోనే విమానం రహదారిపై కూలిపోయింది.
విమానం ఒహియో స్టేట్ యూనివర్శిటీ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. కొద్ది సేపటికే పైలట్ అత్యవసర ల్యాండింగ్‌ను అభ్యర్థించాడు. విమానంలో ఉన్న రెండు ఇంజిన్లు విఫలమైయినట్లుగా గుర్తించారు. ల్యాండింగ్ చేసేలోపే హైవేపై విమానం కూలిపోయింది. విమానం కూలినప్పుడు అందులో ఐదుగురు ఉన్నారు. ఇద్దరు స్పాట్‌లోనే చనిపోయినట్లుగా తెలుస్తోంది. మిగతా ముగ్గురి గురించి వివరాలు తెలియలేదు. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
https://twitter.com/RonEng1ish/status/1756201551754924323