Salaar 2 Update: ‘సలార్2’ గురించి బిగ్ అప్డేట్ ఇచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prithviraj Sukumaran on Salaar 2: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్ పార్ట్-1: సీజ్ ఫైర్’. 2023 డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో దేవాగా ప్రభాస్, వరద రాజమన్నార్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ ఆకట్టుకున్నారు. పార్ట్-1ని ట్విస్ట్‌తో డైరెక్టర్ ముగించాడు. దాంతో రెండో భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా పార్ట్-2పై పృథ్వీరాజ్ సుకుమారన్ బిగ్ అప్డేట్ ఇచ్చారు.
మరికొద్ది రోజుల్లో రెండో పార్ట్ షూటింగ్ ప్రారంభం కానుందని పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ… ‘డైరెక్టర్ ప్రశాంత్ నీల్ జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమా ఖచ్చితంగా 2025లో విడుదల అవుతుందని నేను అనుకుంటున్నా. అయితే కచ్చితమైన రిలీజ్ డేట్ మాత్రం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరియు నిర్మాతలు హోంబలే ఫిల్మ్స్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. సలార్ 2లో కొన్ని సీక్వెన్స్‌లను పూర్తి చేయడానికి నేను ‘ఎల్2: ఎంపురాన్’ నుంచి కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవాలి’ అని తెలిపారు.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
Also Read: Taapsee Pannu Marriage: అందుకే పెళ్లి విషయాన్ని సీక్రెట్‌గా ఉంచా: తాప్సీ
నటుడు బాబీసింహా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… సలార్ 2 కథ సిద్ధంగా ఉందని, ఏప్రిల్‌లో చిత్రీకరణను ప్రారంభించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు అయితే చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయలేదు. పార్ట్ 2ను ‘శౌర్యాంగ పర్వం’ పేరుతో తెరకెక్కించనున్నారు. శత్రువులుగా మారే ఇద్దరు ప్రాణ స్నేహితుల కథతో పార్ట్ 2 రానుంది. ప్రస్తుతం ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’లో నటిస్తుండగా.. ‘ బడే మియాన్ చోటే మియాన్’లో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?