INDvsNZ T20: ఒక్క మ్యాచ్ ఆడకుండానే కప్ అందుకున్నాడు.. పృథ్వీని కూల్ చేశారుగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో దుమ్మురేపింది టీమిండియా. ఈ మ్యాచ్‌లో గెలిచి 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే భారత జట్టు ఏ ట్రోఫీ గెలిచినా అది టీమ్‌లోని ఓ యువ ఆటగాడికి ఇవ్వడం అనే సంప్రదాయాన్ని మరోసారి కొనసాగించింది. తాజాగా ఈ మ్యాచ్‌లో గెలిచి కప్ అందుకున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఆ ట్రోఫీని యువ ఓపెనర్ పృథ్వీ షాకు అందించాడు. ఈ సిరీస్‌కు అతడు ఎంపికైనా కూడా ఒక్క మ్యాచ్‌లో ఆడే అవకాశం మాత్రం దక్కలేదు. కానీ కెప్టెన్ హార్దిక్ నేరుగా వచ్చి అతడికి ట్రోఫీ ఇవ్వడంతో అతడు ఫుల్ హ్యాపీగా ఫీలయ్యాడు. ఆ ట్రోఫీతో ఆనందంగా గెంతులేశాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.
Captain @hardikpandya93 collects the @mastercardindia trophy from BCCI president Mr. Roger Binny & BCCI Honorary Secretary Mr. Jay Shah 👏👏
Also Read
- VMC: మోగిన మున్సిపల్ కార్మికుల సమ్మె సైరన్.. రేపటి నుంచే..
- Team India: టీమిండియాకు భారీ షాక్.. ముగ్గురు ఆల్‌రౌండర్లు ఒకేసారి అవుట్..
- Mamata Banerjee: మమతా బెనర్జీ కాన్వాయ్‌పై చెప్పులతో దాడి.. బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత..
- CM Chandrababu: గిరిజన ఉత్పత్తుల స్టాళ్ల సందర్శన.. బ్రాండింగ్‌పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
Congratulations to #TeamIndia who clinch the #INDvNZ T20I series 2️⃣-1️⃣ @JayShah pic.twitter.com/WLbCE417QU
— BCCI (@BCCI) February 1, 2023
నిజానికి పృథ్వీకి అవకాశం ఇవ్వకుండా ఇషాన్, శుభ్‌మన్ గిల్‌లనే ఓపెనర్లుగా కొనసాగించడంపై హార్దిక్‌ను చాలా మంది విమర్శించారు. ముఖ్యంగా వన్డేల్లో రాణిస్తున్న గిల్ టీ20లకు పనికి రాడని కూడా కొందరు మాజీ క్రికెటర్లు అన్నారు. అయినా వాళ్లపైనే హార్దిక్ నమ్మకముంచాడు. దీని ఫలితం చివరి టీ20లో చూశాం. గిల్ చెలరేగిపోయి టీ20ల్లో తొలి సెంచరీ చేశాడు. కానీ ఇషాన్ మాత్రం మరోసారి విఫలమయ్యాడు.
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌లో దుమ్మురేపిన భారత్.. బౌలింగ్‌లో అదరగొట్టడంతో 168 రన్స్ భారీ తేడాతో గెలిచి సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. టీ20ల్లో టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 234/4 రన్స్ చేసింది. యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 63 బంతుల్లో 126* రన్స్ చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. రాహుల్ త్రిపాఠి (44), హార్దిక్ పాండ్యా (30) రాణించారు. అనంతరం 235 రన్స్ భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన కివీస్ 12.1 ఓవర్లలో 66 రన్స్ చేసి ఆలౌటైంది. భారత బౌలర్లు దుమ్మురేపడంతో న్యూజిలాండ్ బ్యాటర్లు పరుగులు సాధించేందుకు అష్టకష్టాలు పడ్డారు. ఓపెనర్ ఫిన్ అలెన్ (3)ను మొదటి ఓవర్లోనే పెవిలియన్‌కు పంపిన పాండ్యా కివీస్ వికెట్ల ఖాతా తెరిచాడు. అనంతరం రెండో ఓవర్లో కాన్వే (1), చాప్‌మన్ (0)ను ఔట్ చేసిన అర్చదీప్ న్యూజిలాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఫిలిప్స్ (2), బ్రేస్‌వెల్ (8) శాంట్నర్ (13) కూడా పూర్తిగా విఫలమవడంతో 9ఓవర్లలోనే 53 రన్స్‌కు 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. డారైల్ మిచెల్ (35) ఒక్కడే పోరాడినా మిగతా బ్యాటర్ల నుంచి మద్దతు కరవవడంతో కివీస్ భారీ ఓటమి మూటగట్టుకుంది. ఇండియా బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ 4 వికెట్లతో అదరగొట్టగా.. అర్షదీప్, శివం మావి ఉమ్రాన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
Also Read: IN DvsAUS Test: ఆస్ట్రేలియా మాస్టర్ ప్లాన్..టీమిండియాను ఓడించడమే లక్ష్యంగా
తాజావార్తలు
-
VMC: మోగిన మున్సిపల్ కార్మికుల సమ్మె సైరన్.. రేపటి నుంచే..
-
Team India: టీమిండియాకు భారీ షాక్.. ముగ్గురు ఆల్‌రౌండర్లు ఒకేసారి అవుట్..
-
Tragedy : నాన్న చేతిలోనే నలిగిన బాల్యం.. అర్మాన్ మృతి..
-
Mamata Banerjee: మమతా బెనర్జీ కాన్వాయ్‌పై చెప్పులతో దాడి.. బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత..
-
Slum Dog 33 Temple Road: ‘స్లమ్ డాగ్’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ‘గౌరీ హెగ్డే’ స్పెషల్ గ్లింప్స్‌కు రెడీగా ఉండండి!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!