Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- వెస్టిండీస్‌తో మూడో టీ20లో ప్రిన్స్ యాదవ్ 6 బంతుల్లో 13 పరుగులు
- మూడు ఫోర్లతో నాటౌట్‌గా నిలిచిన ప్రిన్స్ యాదవ్
- నంబర్-10లో బ్యాటింగ్‌కు వచ్చిన ప్రిన్స్ కీలక పరుగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prince Yadav: వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా విజయంలో ప్రిన్స్ యాదవ్ చేసింది 13 పరుగులే అయినా కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసి వికెట్ లేకుండా 37 పరుగులు ఇచ్చిన అతడు.. బ్యాట్‌తో మాత్రం జట్టుకు విలువైన పరుగులు అందించాడు. నంబర్ 10లో బ్యాటింగ్‌కు వచ్చిన ప్రిన్స్ యాదవ్ కేవలం 6 బంతుల్లోనే 3 ఫోర్లతో 13 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
భారత్ ఈ మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతోనే విజయం సాధించడంతో ప్రిన్స్ చేసిన 13 పరుగుల ప్రాధాన్యత ఏంటో అర్థమవుతుంది. అతడు చివర్లో బౌండరీలు బాదడంతో భారత్ 223 పరుగుల స్కోరు సాధించగలిగింది. ఈ మూడు ఫోర్లతో ప్రిన్స్ యాదవ్ టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన జాబితాలో చేరాడు. నంబర్ 10 లేదా నంబర్-11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఒక ఇన్నింగ్స్‌లో కనీసం మూడు బౌండరీలు బాదిన భారత బ్యాటర్లలో ప్రిన్స్ యాదవ్ ఇప్పుడు మూడో ఆటగాడిగా నిలిచాడు.
Also Read
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
- Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
ఈ ప్రత్యేక ఘనత సాధించిన మిగిలిన ఇద్దరు భారత ఆటగాళ్లు ఎస్. శ్రీశాంత్, రవిచంద్రన్ అశ్విన్. శ్రీశాంత్ 2007లో న్యూజిలాండ్‌పై ఈ రికార్డు సాధించగా.. అశ్విన్ 2011లో ఇంగ్లాండ్‌పై కోల్‌కతా టీ20లో మూడు బౌండరీలు బాదాడు. అశ్విన్ తర్వాత దాదాపు 15 ఏళ్లకు నంబర్-10 లేదా 11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన భారత ఆటగాడు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో మూడు బౌండరీలు బాదడం ఇదే తొలిసారి.
మూడో టీ20లో భారత్ వెస్టిండీస్‌పై 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకంతో అదరగొట్టగా.. అనంతరం భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. భారత్ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 209 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. వెస్టిండీస్ పర్యటనలో లక్ష్యాన్ని కాపాడుకుని భారత్ విజయం సాధించడం ఇదే మొదటిసారి.
🤯 140 KMPH? PRINCE YADAV JUST SCOOPED IT FOR FOUR! 🔥
🏏 Prince Yadav pulls off a cheeky scoop against raw pace in the 3rd T20I vs West Indies!
Pure audacity. Position No. 10, shot No. 1 confidence! 🇮🇳💥
#INDvWI https://t.co/CYp72X143p
— Cricket Hub (@Anurag9793) October 11, 2026
తాజావార్తలు
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..