NTV Telugu Site icon

Giorgia Meloni: ప్రధాని మోడీకి ‘నమస్తే’తో స్వాగతం పలికిన ఇటలీ ప్రధాని.. (వీడియో)

Modi

Modi

ఇటలీ ప్రధాని జార్జియా మెలోని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం ‘నమస్తే’ అంటూ పలకరించుకున్నారు. జార్జియా మెలోని ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఇటలీ వెళ్లిన సంగతి తెలిసిందే. వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ప్రధాని మోడీ తొలిసారిగా జీ7 సదస్సుకు భారత్‌కు ఆహ్వానం అందింది.

Nara Lokesh: నాపై నమ్మకంతో కీలక శాఖలు కేటాయించిన సీఎంకు కృతజ్ఞతలు.. ఎక్కడ ఆపానో అక్కడి నుండే స్టార్ట్..

ఇదిలా ఉంటే.. ఇటలీలోని అపులియాలో జరుగుతున్న 50వ జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ పలువురు ప్రపంచ నేతలను కలిశారు. ఇప్పటికే.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ అయ్యారు. ఇద్దరు నాయకులు రక్షణ, అణు, అంతరిక్షం, విద్యతో సహా అనేక ప్రధాన ప్రపంచ, ప్రాంతీయ సమస్యలపై చర్చించారు. మరోవైపు.. బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌తోనూ ప్రధాని మోడీ భేటీ అయ్యారు. మూడవసారి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో భారత్-యుకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. సెమీకండక్టర్, టెక్నాలజీ, వాణిజ్యం వంటి రంగాల్లో ఇరు దేశాలు సంబంధాలను మరింత బలోపేతం చేసుకోగలవని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

Depression & Memory Problem: చిన్నవయసులో అధిక ఒత్తిడికి లోనైతే..జ్ఞాపకశక్తి బలహీనం

మరోవైపు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని కూడా ప్రధాని మోడీ కలిశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడితో జరిగిన భేటీ సానుకూలంగా జరిగిందని.. ఉక్రెయిన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు భారత్ ఆసక్తిగా ఉందని ప్రధాని పేర్కొన్నారు. కాగా.. ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై ఇరువురు అగ్రనేతలు ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించారు.

Show comments