NTV Telugu Site icon

PM Modi: ప్రధాని మోడీ ఫోన్ హ్యాక్, ట్రాక్ చేయలేరు..

Modi

Modi

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని అందరికి ఆసక్తి ఉంటుంది. అయితే, వేసుకునే డ్రెస్సుల దగ్గర నుంచి ఆయన వినియోగించే వస్తువుల వరకు ప్రజలు తెలుసుకోవాలని ట్రై చేస్తుంటారు. కానీ.. మోడీ ఏ మొబైల్ వాడుతున్నాడు అనేది ఎంత మందికి తెలుసు..?.. మీరు చూసినట్లైతే.. ప్రధాని మోడీ ఎప్పుడూ రకరకాల ఫోన్ లతో కనిపిస్తుంటాడు. ఇలాంటి రాజకీయ ప్రముఖులు ఐఫోన్ మోడల్స్ ను వాడుతుంటారు. ఇంకా గ్లోబల్ లీడర్లుగా భద్రతా కారణాల దృష్ట్యా స్మార్ట్ ఫోన్ లను వినియోగించడానికి వీరికి పర్మిషన్ లేదు. అంతేకాదు.. వారి ఫోన్ లో కొన్ని స్పెషల్ సాఫ్ట్ వేర్లు ఉన్నాయని తెలుస్తుంది.

Read Also: Golden Ticket: రజనీకాంత్ను వరించిన గోల్డెన్ టికెట్.. వరల్డ్ కప్ ప్రత్యేక అతిథుల జాబితాలో తలైవా

ప్రధాని నరేంద్ర మోడీ, వీఐసీలు కోసం ప్రత్యేకంగా రూపొందించిన శాటిలైట్ లేదా రిస్ట్రిక్టెడ్ ఏరియా ఎక్స్ఛేంజ్ ఫోన్ లను వినియోగిస్తారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెట్ ద్వారా తయారు చేసిన నవరత్న పీ.ఎస్.యూ( PSU ) అన్ని ఇతర కమ్యూనికేషన్‌ల కోసం స్పెషల్ గా ఎన్క్రిప్ట్ చేయబడిన ఫోన్ ని మాత్రమే మోడీ ఆయన ప్రధాన కార్యదర్శి ద్వారా వాడుతుంటాడు. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్ తయారు చేశారు. ఈ ఫోన్ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగించే ఎన్‌క్రిప్టెడ్ డివైజ్. మిలిటరీ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లో ఈ ఫోన్ వర్క్ చేస్తుంది.

Read Also: Womens Reservation Bill: లోక్‌సభ ముందు మహిళా రిజర్వేషన్‌ బిల్లు.. ప్రవేశపెట్టిన కేంద్రం

దీంతో ప్రధాని మోడీ వాడుతున్న ఫోన్ హ్యాక్ చేయబడదు.. ట్రాక్ కూడా చేయబడదు.. దీనిని ఎన్టీఆర్ఓ (NTRO), డీఐటీవై( DITY) లాంటి ఏజెన్సీలు ప్రతి క్షణం పర్యవేక్షిస్తునే ఉంటాయి. త్రి లెవెల్ ఎన్‌క్రిప్టెడ్ సెక్యూరిటీని వినియోగించి శాటిలైట్ నంబర్‌లను ప్రధానమంత్రి ఆఫీస్ ఫోన్ ద్వారా కాల్స్ చేయబడతుంటాయి. ప్రధాని నరేంద్ర మోడీ వాడుతున్న ఫోన్ పేరు రుద్ర.. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ ఫోన్‌ను అభివృద్ధి చేసిందని అనేక నివేదికలు వస్తున్నాయి.

Show comments