ప్రధాని మోడీ సోమవారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. మంగళవారం ఆయన వారణాసిలో నామినేషన్ వేయనున్నారు. ఇందుకోసం పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. నామినేషన్‌కు ముందు రోజే.. అనగా సోమవారం యూపీలో పర్యటించి.. కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం ఆ ప్రాంతంలో రోడ్‌షో కూడా నిర్వహించనున్నారు. మే 14న నామినేషన్ వేసిన అనంతరం సాయంత్రం వారణాసిలో మోడీ రోడ్‌షో చేసేందుకు భారీగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
ఇది కూడా చదవండి: MS Dhoni: ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ కాదు.. చెన్నై ట్వీట్ వెనక అసలు విషయం ఏంటంటే!
ఇక ప్రధానికి ఘనస్వాగతం పలికేందుకు వారణాసి సిద్ధంగా ఉందని, ప్రజలు మరోసారి ఆయనను గెలిపించాలని నిశ్చయిచుకున్నారని కేంద్ర మంత్రి, చాందౌలి లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థి మహేంద్ర నాథ్ పాండే తెలిపారు. ప్రధాని మోడీ తన సొంత నియోజకవర్గానికి పని చేసినంతగా ఏ ప్రధాని తన నియోజకవర్గానికి పనిచేయలేదన్నారు. కాశీ మొత్తం ప్రధానికి అండగా నిలుస్తోందని తెలిపారు. కచ్చితంగా ఈ ఎన్నికల్లో ఆయన గెలిచి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు. వారణాసి నియోజకవర్గం నుంచి మోడీ మూడోసారి పోటీ చేస్తుండగా, ఆయనపై పోటీకి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ సైతం మూడోసారి బరిలో ఉన్నారు. జూన్ 1న జరిగే ఏడవ విడత ఎన్నికల్లో భాగంగా వారణాసిలో పోలింగ్ జరుగనుంది.
ఇది కూడా చదవండి: Bomb threat: ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు బాంబ్ బెదిరింపు.. పోలీసుల తనిఖీలు
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగుతోంది. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ ముగిసింది. నాల్గో విడత సోమవారం జరగనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మరో 10 రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. అనంతరం మే 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదలకానున్నాయి.
ఇది కూడా చదవండి: Jabardasth Mohan: అమ్మాయిలా ఉంటాడని పెళ్లి చేయనన్నారు.. కమెడియన్ భార్య ఎమోషనల్ కామెంట్స్
