Jabardasth Mohan Wife Devi Comments at Sri Devi Drama Company: తెలుగు టెలివిజన్ చరిత్రలో అనేక రికార్డులు బద్దలు కొట్టిన చరిత్ర జబర్దస్త్ షో ది. నిజానికి జబర్దస్త్ లో ఇప్పుడంటే అమ్మాయిలు కూడా నటిస్తున్నారు కానీ ఒకప్పుడు అమ్మాయిల స్థానంలో లేడీ గెటప్స్ వేసుకున్న పురుషులే నటించేవారు. అలా చాలామంది లేడీ గెటప్స్ వేసుకుని ఫేమస్ అయ్యారు కూడా. అలా లేడీ గెటప్స్ వేసుకుని ఫేమస్ అయిన వారిలో మోహన్ కూడా ఒకరు. తాజాగా ఈ లేడీ గెటప్స్ గురించి, తాను పడ్డ ఇబ్బందులను జబర్దస్త్ మోహన్ భార్య శ్రీదేవి డ్రామా కంపెనీలో వెల్లడించింది. తాజాగా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో తన బాధలన్నీ బయటపెట్టినట్లు కనిపిస్తోంది. ఈ షోకి మోహన్ తన భార్యతో కలిసి హాజరవ్వగా ఇదే స్టేజి మీద అతని భార్య మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
Sreemukhi: శ్రీముఖి పెళ్లిపై జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్.. ఈ ఏడాదే అంటూ?
ముందుగా రష్మీ మీది ప్రేమ పెళ్లా? లేక పెద్దలు కుదిరిచిన పెళ్లా అని అడిగితే రెండు అని ఆమె సమాధానమిచ్చింది. అదేంటి అంటే తాము ప్రేమించుకున్నామని పెద్దల్ని ఒప్పించామని మోహన్ భార్య సమాధానం ఇచ్చింది. అయితే తన తల్లిదండ్రులకు మోహన్ ను వివాహం చేసుకోవడం ఇష్టం లేదని, ఎందుకంటే అతను అమ్మాయిలా ఉంటాడు ఎక్కువగా జబర్దస్త్ లో అమ్మాయిలు పాత్రలు వేస్తూ ఉంటాడు కాబట్టి వాళ్లకి మోహన్ నచ్చలేదని చెప్పుకొచ్చారు. అయితే తాను మోహం ఇష్టపడడానికి అమ్మానాన్నని ఒప్పించి వివాహం చేసుకున్నట్లు దేవి వెల్లడించింది. ఇక ఇదే ప్రోమోలో ఆటో రాంప్రసాద్, పొట్టి నరేష్, ఫైమా లాంటి వాళ్లు తమదైన శైలిలో నవ్వించే ప్రయత్నం చేశారు కానీ మొత్తం మీద జబర్దస్త్ మోహన్ భార్య చేసిన కామెంట్లు మాత్రమే సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ త్వరలో టెలికాస్ట్ కానుంది.