NTV Telugu Site icon

PM Modi: ముగిసిన ప్రధాని ఇటలీ పర్యటన.. ఢిల్లీకి చేరుకున్న మోడీ

Pm Modi

Pm Modi

ఇటలీలో జీ7 శిఖరాగ్ర సమావేశానికి హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఇటలీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. ఇటలీ పర్యటనలో జీ7 దేశాల ఔట్ రీచ్ సదస్సుకు హాజరైన మోడీ.. వివిధ దేశాధినేతలతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ తదితరులతో మోడీ అనేక అంశాలపై చర్చలు జరిపారు. జీ-7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీని ఆహ్వానించడం, వేగంగా ఎదుగుతున్న చైనాను ఎదుర్కోవడానికి పశ్చిమ దేశాల ప్రణాళికల్లో భారత్‌కు ప్రముఖ స్థానం లభిస్తోందనడానికి సూచన. భారత్‌తో పాటు 11 అభివృద్ధి చెందుతున్న దేశాల నేతలను కూడా ఆహ్వానించారు.

Read Also: Financial Fraud : షాకింగ్.. మూడేళ్లలో 47శాతం మంది యూపీఐ, క్రెడిట్ కార్డ్ మోసాలకు గురయ్యారు

దేశంలో ఎన్డీయే కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రధాని మోడీ చేపట్టిన మొదటి విదేశీ పర్యటన. కాగా.. ఇటలీలో మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీని ప్రపంచ దేశాల నేతలు అభినందించారు. ప్రధాని మోడీ శనివారం ఉదయం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. “అపులియాలో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశం చాలా ఉపయోగకరంగా ఉంది. ప్రపంచ నేతలతో కలిసి సంభాషించి పలు అంశాలపై చర్చించారు. గ్లోబల్ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చే ప్రభావవంతమైన పరిష్కారాలను రూపొందించడం, భవిష్యత్తు తరాలకు మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడం మా లక్ష్యం. ఇటలీ ప్రజలు, ప్రభుత్వం వారి సాదర ఆతిథ్యానికి ధన్యవాదాలు.’’ అంటూ రాసుకొచ్చారు.

Read Also: Delhi Water Crisis: హస్తినలో నీటి కటకట.. కాంగ్రెస్ నేతల నిరసన