తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ లో రోడ్ షోలో పాల్గొన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి కాచిగూడ చౌరస్తా వరకు మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. బీజేపీ కార్యకర్తలు, జనాలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రోడ్ షో జరుగుతున్నంత సేపు.. మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. 45 నిమిషాలు పాటు ఈ రోడ్ షో సాగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుండి కాచిగూడ చౌరస్తా వరకు 2.5 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించారు. అనంతరం.. కాచిగూడ చౌరస్తాలో వీర్ సావర్కర్ విగ్రహానికి ప్రధాని మోదీ నివాళులు అర్పించారు.
Bhatti Vikramarka: ఆంజనేయస్వామి గుడిలో భట్టి విక్రమార్క ప్రమాణం
ఇదిలా ఉంటే.. 7.30 నుండి 7.40 వరకు అమీర్ పేటలో గురుద్వారాను ప్రధాని మోదీ సందర్శించనున్నారు. ఆ తర్వాత.. 8 నుండి 8.45 వరకు భక్తి కోటి దీపోత్సవంలో పాల్గొననున్నారు. అనంతరం 9 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు మోదీ. దీంతో.. తెలంగాణలో ప్రధాని మోదీ మూడు రోజుల పర్యటన ముగియనుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. 8 సభలు, ఒక రోడ్ షో, మూడు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ తరపున విస్తృత ప్రచారం చేశారు. కాగా.. ఈరోజు తెలంగాణలో పలు చోట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం 11 గంటలకు మహబూబాబాద్ లో, మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్ విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు.
CM KCR: బీజేపీకి ఓటేస్తే మురికి కాలువలో వేసినట్టే..