Site icon NTV Telugu

PM Modi: ప్రతిపక్షాలది ఇండియా కూటమి కాదు.. అహంకారుల కూటమి..!

Modi

Modi

లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు ముందు ఇవాళ (మంగళవారం) ఉదయం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలోని పార్లమెంట్‌ ఆవరణలో జరిగిన ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పార్టీ నేతలందరూ హాజరయ్యారు. ఈ క్రమంలో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడంపై ఎంపీలకు ప్రధాని మోడీ దిశానిర్దేశం చేశారు.

Read Also: Online Transaction: గుడ్ న్యూస్.. డెబిట్-క్రెడిట్ కార్డ్‌ల వాడకానికి ఇకనుంచి సీవీవీ తప్పనిసరి కాదు

ఇక, బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలది ఇండియా కూటమి కాదు.. అహంకారుల కూటమి అని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అహంకారులను ఐక్యంగా ఎదుర్కోవాలని బీజేపీ ఎంపీలకు మోడీ పిలుపునిచ్చారు. అవినీతి, వారసత్వ రాజకీయాలకు క్విట్‌ ఇండియా అని పేర్కొన్నారు. సోమవారం రాజ్యసభలో ఆమోదం పొందిన వివాదాస్పద ఢిల్లీ సర్వీసెస్ బిల్లును ప్రధాని ప్రస్తావిస్తూ.. విపక్ష కూటమిపై సీరియస్ అయ్యారు.

Read Also: CP Ranganath: కల్తీ మందులు రైతులకు అమ్మితే.. పీడీ యాక్ట్ అమలు చేస్తాం..

విపక్ష కూటమిలోని అవిశ్వాసాన్ని కప్పిపుచ్చుకునేందుకే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చారని ప్రధాని మోడీ విమర్శించారు. లాస్ట్‌ బాల్‌కు సిక్స్‌ కొట్టి మ్యాచ్‌ నెగ్గినట్టే విపక్షాలపై పైచెయ్యి సాధించాలని ఆయన పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపక్షాల ఐక్యతకు, వారి అంతర్గత విశ్వాసానికి పరీక్ష అని మోడీ తెలిపారు. ఈ ఓటుతో వాళ్లు ఐక్యంగా ఉన్నారో, ఎవరూ లేరో స్పష్టంగా తెలుస్తుందని అని ప్రధాని అన్నారు. ప్రతిపక్ష కూటమి ఇండియా 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు సెమీ-ఫైనల్ కావాలని కోరుకుంటోందని, దానికి తగ్గట్లే ఫలితాలు అందరూ చూడాలని ప్రధాని మోడీ తెలిపారు.

Read Also: Samsung Galaxy F34 5G Price: 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీతో శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్34.. ప్రైస్, ఫీచర్స్ డీటెయిల్స్ ఇవే!

కాగా.. మణిపూర్ అంశంపై గత కొన్ని రోజులుగా పార్లమెంట్‌ వేదికగా అధికార విపక్షాల మధ్య చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్డీయే సర్కార్‌ నేడు లోక్‌సభలో అవిశ్వాసాన్ని ఎదుర్కోనుంది. ఇండియా కూటమి ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్‌ ఓంబిర్లా ఆమోదించి.. చర్చకు మూడు రోజుల సమయం ఇచ్చారు. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ అవిశ్వాసంపై చర్చ ప్రారంభించారు.

Exit mobile version