కేంద్రంలో వరుసగా రెండుసార్లు గెలిచి దేశవ్యాప్తంగా ఈ తొమ్మిదేళ్లలో పలు కీలక రాష్ట్రాల్లో విజయాలు సాధించిన కమలం పార్టీకి ఇప్పుడు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఎన్నో ఆశలు పెట్టుకున్న కర్ణాటక ఎలక్షన్స్ లో ఓడిపోయింది. అంతకు ముందు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లోనూ గట్టి ఎదురుదెబ్బ బీజేపీకి తగిలింది. దీంతో రెండు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల్లో ఛత్తీస్ ఘడ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా హస్తం పార్టీ ఖాతాలో పడేలా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అంతర్మథనంలో పడింది. నిన్న( ఆదివారం) జరిగిన బీజేపీ ప్రాంతీయ సంప్రదింపుల మీటింగ్ లో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దక్షిణాది రాష్ట్రాల పార్టీ అధ్యక్షులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Read Also: TSPSC : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో 10 మంది అరెస్ట్..
ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ మంది ఎంపీల్ని దక్షిణాది నుంచే గెలిచేలా చూడాలని నేతలకు జేపీ నడ్డా ఆదేశించించారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా, పుదుచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్‌ల ఇన్‌ఛార్జ్‌లు ఉన్నారు. కర్ణాటకలో బీజేపీ ఓటమితో దక్షిణాదిలోని మిగతా రాష్ట్రాలపై పడుతుందన్న అంచనాకు కమలం పార్టీ వచ్చింది. అలా జరుగకుండా చూడాలని దక్షిణాది రాష్ట్రాల పార్టీ అధ్యక్షులకు ఆదేశాలను జారీ చేసింది. అలాగే 2024 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ భారత్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే సంకేతాలను ఇచ్చింది. దక్షిణాదిలోని ప్రజలకు చేరువయ్యేందుకు వీలుగా ప్రధాని మోడీ ఇక్కడి నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉందని బీజేపీ అధిష్టానం పేర్కొంది.
Read Also: Ustaad: శ్రీసింహా కోడూరి ‘ఉస్తాద్’ షూటింగ్ పూర్తి.. ఆగస్ట్ 12న విడుదల
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీని దక్షిణాదిలోని ఏ రాష్ట్రం నుంచి పోటీ చేయించాలనే దానిపై బీజేపీ కసరత్తు స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కర్ణాటకలోని బెంగళూరు సిటీలో ఉన్న ఎంపీ సీట్లలో కానీ, తెలంగాణలోని సికింద్రాబాద్ వంటి సీటు నుంచి కానీ.. లేదా తమిళనాడు నుంచి కానీ పోటీ చేయించేందుకు అన్వేషణ చేస్తున్నారు. ఈ కసరత్తు త్వరలో పూర్తి చేసి మోడీ పోటీ చేసే నియోజకవర్గాన్ని ముందే ప్రకటించేందుకు బీజేపీ హైకమాండ్ ప్రయత్నాలు చేస్తుంది.
