Ustaad Movie Shoot Completed: కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్న యంగ్ హీరో శ్రీసింహా కోడూరి ఈ మధ్యనే భాగ్ సాలే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి కొడుకు అయినప్పటినీ తనదైన రూట్‌ను ఏర్పరుచుకుంటూ ముందుకు వెళుతున్న శ్రీసింహ మత్తు వదలరా, భాగ్ సాలే వంటి వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ఇక ఈసారి ఈయన ఆగస్ట్ 12న ‘ఉస్తాద్’ చిత్రంతో మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. ‘ఉస్తాద్’ మూవీ అనౌన్స్‌మెంట్ రోజు నుంచే సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ మూవీలో కావ్యా కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వారాహి చలనచిత్రం, క్రిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై ‘ఉస్తాద్’ చిత్రాన్ని ఫణిదీప్ దర్శకత్వంలో రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Pujita Ponnada: ఎర్ర కోక కట్టి సెగలు రేపుతున్న పూజిత పొన్నాడ..ఘాటెక్కించే మిర్చిలా!
ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తవగా ఇప్పుడు దర్శక నిర్మాతలు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. రీసెంట్‌గా విడుదలైన టీజర్.. ‘రోజు’ అనే సాంగ్‌కు కూడా మాంచి రెస్పాన్స్ వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో, పరిమితమైన బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఆడియెన్స్‌ను అలరిస్తుందని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇక ఈ సినిమాలో శ్రీసింహ మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించబోతున్నారు. డిఫరెంట్ మూవీస్, పరిమిత బడ్జెట్‌లతో రూపొందుతోన్న సినిమాలకు అద్భుతమైన స్పందన వస్తున్న నేపథ్యంలో ఉస్తాద్ నిర్మాతలు అదే నమ్మకంతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఇక ఈ సినిమాలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, అను హాసన్, రవీంద్ర విజయ్, వెంకటేష్ మహ, రవి శివ తేజ, సాయికిరణ్ ఏడిద కీలక పాత్రల్లో నటించారు. అకీవా బి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.