Site icon NTV Telugu

PM Modi: నితీష్‌కు ప్రధాని ఫోన్.. అభినందనలు తెలిపిన మోడీ

Modi

Modi

ఏడాది తిరగకుండానే బీహార్ పాలిటిక్స్‌ రివర్స్ అయిపోయాయి. జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు బీజేపీలో తలుపులు మూసుకుపోయాయని సంవత్సరం క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. కానీ లోక్‌సభ ఎన్నికల ముందు అంతా మారుమారైపోయాయి. బీజేపీ నుంచి బయటకొచ్చిన కొద్ది రోజులకే నితీష్‌కుమార్ మళ్లీ కమలంతోనే జత కట్టారు. ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి పదవికి నితీష్ రాజీనామా చేశారు. మరోసారి బీజేపీ మద్దతుతో సీఎంగా నితీష్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే జేడీయూకు మద్దతు తెలుపుతూ బీజేఎల్పీ లేఖను అందజేసింది. దీంతో జేడీయూ-బీజేపీ కూటమితో కూడిన ప్రభుత్వాన్ని ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను నితీష్ కోరగా సాయంత్రం 5 గంటలకు ఆహ్వానించారు.

Read Also: AP Politics: తిరుపతిలో వైసీపీ-టీడీపీ పోటాపోటీ సమావేశాలు..

ఇదిలా ఉంటే జేడీయూ అధినేత నితీష్‌కుమార్‌కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న నితీష్‌కు మోడీ అభినందనలు తెలిపారు. ఆదివారం సాయంత్రం 5గంటలకు ముఖ్యమంత్రిగా తొమ్మిదో సారి నితీష్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. నితీష్‌తో పాటు బీజేపీకి చెందిన ఇద్దరు ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే జేడీయూకు మద్దతిస్తున్న మరో ఆరుగురు కూడా మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా స్పీకర్ పదవి కూడా బీజేపీకే దక్కనున్నట్లు సమాచారం.

Read Also: Jaipur: టీనేజ్ బాలికపై మామ, అతని కొడుకు అత్యాచారం.. పరువు కోసం గర్భం తీయించిన కుటుంబం..

9వ సారి ముఖ్యమంత్రి కానున్న నితీష్ కుమార్!

మొదటిసారి – మార్చి 3, 2000
రెండవసారి- నవంబర్ 24, 2005
మూడవసారి- నవంబర్ 26, 2010
నాల్గవసారి- ఫిబ్రవరి 22, 2015
5వ సారి- నవంబర్ 20, 2015
ఆరవసారి- జూలై 27, 2017
7వ సారి- నవంబర్ 16, 2020
8వ సారి- ఆగస్టు 9, 2022
9వ సారి- జనవరి 28, 2024న సీఎంగా నితీష్ ప్రమాణం చేయనున్నారు.

Exit mobile version