Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరోసారి కంటి శస్త్రచికిత్స చేయించుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం న్యూఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్‌లో ఆమె కుడి కంటికి క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నారని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది.శస్త్రచికిత్స విజయవంతమైందని, ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది.
Church Pastor: పాస్టర్ వింత చేష్టలు.. దేవుడు ఆ పని చేయమంటున్నాడంటూ
64 ఏళ్ల వయస్సు గల ద్రౌపది ముర్ము అక్టోబర్ 16న ఆర్మీ ఎడమ కంటికి కంటిశుక్లం శస్త్రచికిత్స చేయించుకున్నారు. తాజాగా కుడి కన్నులోని శుక్లాలను కూడా విజయవంతంగా తొలగించిట్లు రాష్ట్రపతి మీడియా కార్యదర్శి అజయ్‌కుమార్ సింగ్ పేర్కొన్నారు. భారత 15వ రాష్ట్రపతిగా అధ్యక్షుడు ముర్ము జూలై 25న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.