Prabhas : ప్రభాస్ నటించిన “కల్కి 2898 AD “సినిమాకోసం ప్రేక్షకులు ఎంత గానో ఎదురు చూస్తున్నారు.స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాలో కమల్ హాసన్ ,అమితాబ్ బచ్చన్ వంటి లెజెండరీ యాక్టర్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.అలాగే దీపికా పదుకోన్ ,దిశాపటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.భారీ విజువల్స్ తో హాలీవుడ్ స్థాయిలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించాడు.
Read Also :Mahesh Babu : రాజమౌళి తరువాత మళ్ళీ ఆ దర్శకుడితో సినిమా..?
ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఇప్పటికే ముంబై లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.ప్రస్తుతం ఈ సినిమా పై ప్రపంచ వ్యాప్తంగా భారీ బజ్ క్రియేట్ అయింది.తాజాగా ఈ సినిమా కథ ఎలా ఉంటుందో వివరిస్తూ “కల్కి జర్నీ”గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ ఎపిసోడ్స్ లో చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉంటే నిన్న సాయంత్రం కల్కి సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు .ఈ రిలీజ్ ట్రైలర్ సినిమాపై భారిగా అంచనాలు పెంచేసింది.అమితాబ్ ,ప్రభాస్ మధ్య జరిగే ఫైట్ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలువున్నాయి.అలాగే ఈ ట్రైలర్ చివరిలో ఈ సారి బాగా ప్రిపేర్ అయి వచ్చాను అంటూ చెప్పే డైలాగ్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.మరో 4 రోజులలో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.భారీ ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తుంది.