Site icon NTV Telugu

RRR Case: రఘు రామకృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ కేసులో.. అడిషనల్ ఎస్పీ అరెస్ట్‌కు సన్నాహాలు

Rrr Case

Rrr Case

సీఐడీ మాజీ అడిషనల్ ఎస్పీ విజయపాల్‌ను అరెస్ట్ దిశగా పోలీసులు చర్యలు సాగిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విజయపాల్ ను పోలీసులు విచారించారు. ఆయన రఘురామ కృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో ముద్దాయిగా ఉన్నారు. గత విచారణలో విజయపాల్‌ని ఎన్ని ప్రశ్నలు అడిగినా గుర్తు లేదు.. తెలియదు.. మర్చిపోయాను అంటూ సమాధానమిచ్చారు. రెవెన్యూ అధికారులు ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. విజయపాల్ కి ముందస్తు బెయిల్ సుప్రీం కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ అరెస్ట్ కి సన్నాహాలు చేస్తున్నారు.

READ MORE: Maharashtra Election Results: మహారాష్ట్ర ఎన్నికల్లో ముస్లిం ఓటర్ల ప్రభావం ఏమైంది..?

నరసాపురం మాజీ ఎంపీ, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌కు సుప్రీంకోర్టులో ఇటీవల ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలన్న ఆయన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. సుదీర్ఘ వాదనల అనంతరం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేతో కూడిన ధర్మాసనం విజయ్‌పాల్ పిటిషన్‌ను కొట్టివేసింది. సీబీఐ కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధికారులపై కేసు నమోదు చేయాలంటూ రఘురామరాజు ఇటీవల గుంటూరులో ఫిర్యాదు చేశారు.

READ MORE:Pawan Kalyan: రైల్వే మంత్రితో ముగిసిన పవన్ భేటీ.. పిఠాపురంలో పలు అభివృద్ధి పనులపై చర్చ

Exit mobile version