సీఐడీ మాజీ అడిషనల్ ఎస్పీ విజయపాల్‌ను అరెస్ట్ దిశగా పోలీసులు చర్యలు సాగిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విజయపాల్ ను పోలీసులు విచారించారు. ఆయన రఘురామ కృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో ముద్దాయిగా ఉన్నారు. గత విచారణలో విజయపాల్‌ని ఎన్ని ప్రశ్నలు అడిగినా గుర్తు లేదు.. తెలియదు.. మర్చిపోయాను అంటూ సమాధానమిచ్చారు. రెవెన్యూ అధికారులు ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. విజయపాల్ కి ముందస్తు బెయిల్ సుప్రీం కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఎస్పీ ఏఆర్…
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్నకీలకంగా వ్యవహరించారు. ప్రభాకర్ రావు, భుజంగరావు ఆదేశాలతో మెరుపు దాడులు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థుల డబ్బులు ఎక్కడికి రవాణా అవుతుంటే అక్కడికి వెళ్లి పట్టుకున్నారు తిరుపతన్న. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు డబ్బు చేరకుండా దాడులు చేసి పట్టుకున్నారు.
తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతోంది. తెలంగాణ పోలీసు శాఖలో బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారీగా డీఎస్పీలు, ఏఎస్పీలను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో 12 మంది అడిషనల్ ఎస్పీలకు స్థానచలనం కలిగించింది. ఈ మేరకు డీజీపీ రవిగుప్తా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. నిజామాబాద్ అడిషనల్ డీసీపీగా ఎస్ రమేశ్, ఆదిలాబాద్ అడిషనల్ ఎస్పీగా సురేందర్ రావు, హైదరాబాద్ ట్రాఫిక్-3 అడిషనల్ డీసీపీగా రామారావు, సైబరాబాద్ క్రైమ్ అడిషనల్ డీసీపీగా…