Pregnant Women Diet: ప్రెగ్నన్సీ సమయంలో ఇవి తాగడం ప్రమాదకరం.. పిల్లలపై ప్రతికూల ప్రభావం!
- చక్కెర పానీయాలు ప్రమాదం
- ప్రెగ్నన్సీ మహిళలలో సమస్యలు
- ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలంటున్న పరిశోధకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sugar Drinks harmful for Pregnant Womens: చక్కెర పానీయాలు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని అందరికీ తెలిసిన విషయమే. చక్కెర పానీయాలు తీసుకోవడం వల్ల దంత సమస్యలు, బరువు పెరగడం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. అదే ప్రెగ్నన్సీ సమయంలో షుగర్ డ్రింక్స్ తాగే మహిళలకు పుట్టే పిల్లల్లో చాలా రకాల సమస్యలు కనిపిస్తున్నాయని తాజా పరిశోధనలో వెల్లడైంది.
పీర్-రివ్యూడ్ జర్నల్ న్యూట్రియెంట్స్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. గర్భధారణ సమయంలో అధిక మొత్తంలో చక్కెర పానీయాలను తీసుకునే మహిళలపై మాత్రమే కాదు వారి పుట్టబోయే పిల్లలపై కూడా ప్రతికూల ప్రభావాలను చూపుతాయట. ఈ సర్వే ఏప్రిల్ 2022 నుంచి జూన్ 2023లో నిర్వహించబడింది. ఈ సర్వేలో 4 వేల మందికి పైగా గర్భిణులకు పండ్ల రసం, కార్బోనేటేడ్ పానీయాలు, సోడా, జ్యూస్ మరియు పాల ఉత్పత్తులు ఇచ్చారు. చక్కెర పానీయాలు అధికంగా తీసుకునే స్త్రీలు.. గర్భధారణ సమయంలో మధుమేహం సమస్యతో బాధపడుతున్నారని తేలింది.
Also Read
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహ సమస్యను ‘జెస్టేషనల్ డయాబెటిస్’ అంటారు. అంటే పిల్లల బరువు సాధారణం కంటే ఎక్కువగా ఉండవచ్చు. దీని కారణంగా ప్రసవ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాకుండా శిశువుకు కామెర్లు వచ్చే అవకాశం కూడా ఉంది. వారానికి మూడుసార్లు చక్కెర పానీయాలు తీసుకునే మహిళల్లో జెస్టేషనల్ డయాబెటిస్ వచ్చే ప్రమాదం 38 శాతం ఎక్కువగా ఉంటుందట. అంతేకాకుండా 64 శాతం గర్భధారణ రక్తపోటు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
Also Read: Sachin Tendulkar: సచిన్ సర్.. జర మీ దోస్తును ఆదుకోరాదు!
గర్భధారణ సమయంలో చక్కెర పానీయాలను అధికంగా తీసుకోవడం వల్ల పిండానికి తగినంతగా రక్తం సరఫరా కాదని, దాని కారణంగా శిశువు పెరుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సర్వేలో తేలింది. దీని కారణంగా అకాల డెలివరీ అయ్యే అవకాశాలు పెరుగుతాయట. ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మహిళలు తమ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పరిశోధకులు అంటున్నారు.
తాజావార్తలు
-
OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
-
Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్‌మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!