Site icon NTV Telugu

Heart Stroke : హాస్పిటల్లోనే గుండెపోటుతో గర్భిణి మృతి

Pragent

Pragent

ఈ మధ్యకాలంలో చిన్నా పెద్ద అని తేడాలేకుండా గుండె పోటు మరణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అప్పటి వరకు మంచిగా ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ తో మరణిస్తున్నారు. ఇలా ఇళ్లు, రోడ్లు, స్కూ్ల్స్, ఆఫీసులు అక్కడ.. ఇక్కడ అని కాదు.. ఎక్కడపడితే అక్కడ గుండెపోటుతో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఓ గర్భిణి హాస్పటల్ లోనే గుండెపోటుతో ప్రాణాలు విడిచింది. హైదరాబాద్ లోని తిలక్ నగర్ లో హేమంత్-కల్పన దంపతులు నివాసముండేవారు. భర్త ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి కాగా భార్య ఇంట్లోనే ఉండేది. గతేడాది వీరికి పెళ్లి కాగా కల్పన గర్భంతో ఉంది. దీంతో సీమంతం కోసం ఇటీవలే కల్పనను పుట్టింటికి పంపించినట్లు హేమంత్ పేర్కొన్నాడు.

Also Read : Delhi: ఢిల్లీ సాకేత్ కోర్టులో కాల్పులు..

కాచిగూడ పరిధిలోని సంజీవయ్య నగర్ లో తల్లిదండ్రుల వద్దే గత 15 రోజులుగా కల్పన ఉంటుంది. అయితే నిన్న (గురువారం) ఉదయం స్నానం కోసం బాత్రూంలోకి వెళ్లిన కల్పన ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోయింది. దీంతో తల్లిదండ్రులు ఆమెనే గాంధీ హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు కల్పనకు చికిత్స అందిస్తుండగా ఒక్కసారిగా ఫిట్స్, గుండెపోటుకు గురయ్యింది. ఇలా ముందే గర్భంతో ఉండి గాయాలపాలైన ఆమె గుండెపోటుకు గురి కావడంతో డాక్టర్లు ప్రాణాలు కాపాడలేకపోయారు. కల్పనతో పాటు కడుపులోని బిడ్డ ప్రాణాలు కోల్పోవడంతో హేమంత్ తో పాలు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు్న్నారు.

Also Read : Raviteja: కొత్త కారుకు ఫ్యాన్సీ నంబర్ కోసం రవితేజ ఎంత ఖర్చుచేశారో తెలుసా ?

Exit mobile version