NTV Telugu Site icon

Shocking Video: భర్త చనిపోయిన బెడ్‌ను ఐదు నెలల గర్భిణితో శుభ్రం చేయించిన ఆస్పత్రి సిబ్బంది..

Madhya Pradesh Viral

Madhya Pradesh Viral

మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఐదు నెలల గర్భిణిని ఆసుపత్రి బెడ్‌పై ఉన్న రక్తాన్ని శుభ్రం చేయించారు ఆస్పత్రి సిబ్బంది. అంతకుముందు.. ఆ బెడ్ పై తన భర్త చనిపోయి ఉన్నాడు. ఈ క్రమంలో.. క్లీన్ చేయాలని తనపై ఒత్తిడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. గర్భిణీ స్త్రీకి బెడ్ మొత్తం శుభ్రం చేయాలని సిబ్బంది చెబుతుంది. అక్కడ నిలబడి ఉన్న ఒక నర్సు పూర్తిగా శుభ్రం చేయాలని అంటుంది. ఆ మహిళ ఒక చేతిలో రక్తం మరకలున్న గుడ్డ పట్టుకుని మరో చేత్తో టిష్యూతో బెడ్‌ను శుభ్రం చేస్తుండడం వీడియోలో కనిపిస్తుంది.

Read Also: Jammu Kashmir: లోయలో పడ్డ కారు.. 10 నెలల బాలుడితో సహా ముగ్గురు మృతి

దిండోరి జిల్లాలోని లాల్‌పూర్ గ్రామంలో చాలా రోజులుగా కొనసాగుతున్న భూ వివాదంలో నలుగురు వ్యక్తులను కాల్చి చంపారు. బుల్లెట్ గాయాలతో తండ్రి, అతని కొడుకుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు శివరాజ్, రామ్‌రాజ్‌లను చికిత్స నిమిత్తం గడసరాయ్ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. శివరాజ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ క్రమంలో.. అతని భార్య అయిన గర్భవతిని ఆసుపత్రి బెడ్‌ను శుభ్రం చేయమని ఆస్పత్రి సిబ్బంది బలవంతం చేశారు. మరోవైపు.. ఆస్పత్రి సిబ్బంది తనను శుభ్రం చేయాలని చెప్పలేదని, ఆమె శుభ్రం చేసినట్లుగా ఆస్పత్రి అధికారి క్లారిటీ ఇచ్చారు. కాగా.. కాల్పుల ఘటనలో ఏడుగురిపై హత్య సహా పలు సెక్షన్ల కింద గడసరాయ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకోగా.. మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Read Also: CM Chandrababu: 2 గంటల్లోనే విశాఖ నుండి అమరావతికి..

Show comments