మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యువ కథానాయిక ప్రీతి ముకుందన్, తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలో ‘నెమలి’ అనే పాత్రలో ఆమె నటనకు, అందానికి మంచి మార్కులు పడ్డాయి. అయితే, ఇప్పుడు ఈ భామ టాలీవుడ్ నుంచి నేరుగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. హిందీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోగా ఉన్న కార్తీక్ ఆర్యన్ సరసన ప్రీతికి బంపర్ ఆఫర్ దక్కినట్లు సమాచారం.
Also Read : Rajinikanth: తలైవా ఫ్యాన్స్‌కు బిగ్ అప్‌డేట్: రజనీకాంత్ బయోపిక్‌పై ఐశ్వర్య క్రేజీ కామెంట్స్!
ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ చేతిలో కబీర్ ఖాన్ దర్శకత్వంలో ఒక సినిమాతో పాటు,‘నాగ్జిల్లా‘ అనే మరో భారీ ప్రాజెక్ట్ ఉంది. ఈ రెండింటిలో ఏదో ఒక చిత్రంలో ప్రీతిని హీరోయిన్‌గా ఎంపిర చేసేందుకు చిత్రబృందం చర్చలు జరుపుతోందట. ఇప్పటికే స్ర్కీన్ టేస్ట్ అలాగే చర్చలు కూడా ముగిశాయని, త్వరలోనే దీనిపై అధికారిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. మొదటి సినిమాతోనే మెప్పించిన ఈ మలయళ కుట్టి,బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్ వంటి స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేస్తే మాత్రం ఆమె కెరీర్ మలపు తిరిగిట్లే. మరి ఈ క్రేజీ కాంబినేషన్ నిజమవుతుందో లేదో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.