వర్షాకాలంలో అనేక ప్రాణాంతక వైరస్‌లు మనల్ని అనారోగ్యానికి గురయ్యేలా చేస్తుంది. H1N1 వైరస్ కారణంగా వచ్చే స్వైన్ ఫ్లూ వంటి వాటికి నివారణ లేనప్పటికీ, మిమ్మల్ని మీరు దాని బారిన పడకుండా కాపాడుకోవటం చాలా ముఖ్యం. H1N1 వైరస్ యొక్క లక్షణాలు, కారణాలు , చికిత్సలపై అవగాహన పెంచుకోవడమే కాదు.. ఈ వ్యాధి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఛాన్స్ ఉంది.
Read Also: Hyderabad ORR: ఔటర్ రింగురోడ్డు మీద స్పీడ్ లిమిట్ పెంపు
H1N1 వైరస్, దీనినే స్వైన్ ఫ్లూ అని కూడా పిలుస్తారు, ఇది ఒక అంటువ్యాధి శ్వాసకోశ వైరస్.. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది దీని బారిన పడుతున్నారు. ఇది ఒక రకమైన ఇన్ఫ్లుఎంజా వైరస్ లాంటిది. మానవులలో తేలికపాటి నుంచి తీవ్రమైన అనారోగ్యానికి ముఖ్య కారణం ఇది. గత దశాబ్ద కాలంలో H1N1 వ్యాప్తి మానుషులు, జంతువులలో ఎక్కువగా కనిపిస్తుంది.
Read Also: Epione: మోకాలి నొప్పి చికిత్సలో సంచలనం.. సరికొత్త పరికరాన్ని తీసుకొచ్చిన ఇపియోన్
H1N1 వైరస్ యొక్క సాధారణ లక్షణాలు కాలానుగుణంగా మారుతుంటాయి. వీటిలో జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, బాడీ పెయిన్స్, తలనొప్పి, చలి, అలసట, వాంతులు, విరేచనాలు అవుతుంటాయి. కొందరిలో న్యుమోనియా వంటి తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి. ఈ లక్షణాలలో దేనినైనా గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
Read Also: Kottu Satyanarayana: దేవాదాయ సమీక్షలో కీలక నిర్ణయాలు.. 70 కోట్లతో ఇంద్రకీలాద్రి అభివృద్ధి
H1N1 వైరస్ సోకిన వ్యక్తి నుంచి లాలాజలం, శ్లేష్మం వంటి శ్వాసకోశ స్రావాల ద్వారా ఇది వ్యాపిస్తుంది. కలుషితమైన ఉపరితలాలు, డోర్ నాబ్‌లు, బొమ్మలు లాంటి వస్తువులను తాకటం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వ్యక్తి మరొక వ్యక్తి దగ్గర దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు గాలి ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంది.
H1N1 వైరస్ చికిత్సలో సాధారణంగా రెస్ట్ చాలా అవసరం.. డాక్టర్లు సూచించిన మెడిసిన్స్ తీసుకోవాలి. లక్షణాలు తీవ్రంగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, యాంటీబయాటిక్ చికిత్స అవసరమవుతంది. కాబట్టి వెంటనే వైద్య సహాయం పొందటం చాలా ముఖ్యం. H1N1 వైరస్ నుంచి రక్షించడానికి టీకాలు కూడా అందుబాటులో ఉంటాయి.
Read Also: Neeraja Kona: నీరజా కోన-సిద్దు జొన్నలగడ్డ సినిమా కోసం ఆరుగురు నేషనల్ అవార్డు విన్నర్లు
వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రాలలో గర్భిణీ స్త్రీలు, 5 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లలకు, 65 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలు లేదా ఆస్తమా, షూగర్ వంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారి నుంచి వైరస్ సంక్రమించే ఛాన్స్ ఉంది.. కనుక వారికి మాత్రమే టీకాలు వేయించాలి. H1N1 వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి పరిశుభ్రతను పాటించాలి. H1N1 వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోరాదు. తినటానికి ముందు సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు చేతులను క్లీన్ చేసుకోవాలి. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండి.. దగ్గిన, తుమ్మిన నోరు, ముక్కును కప్పి ఉంచడం చాలా ముఖ్యం.