మీసం సైజు కాస్త పెద్దగా ఉంటేనే రొయ్య మీసం అని కామెంట్ చేస్తుంటారు. అదే బారెడు మీసం కనిపిస్తే ఔరా…! అనాల్సిందే. సరిగ్గా వైజాగులో ఇలాంటి మీసం ఒకటి ఆశ్చర్య పరిచింది. అది మనుషులకు కాదు జానెడు రొయ్య కు కావడం ఆసక్తికరంగా మారింది. సాగర్ నగర్ సమీప సముద్రం లో వేటకు వెళ్ళిన మత్స్య కారులకు రాళ్లపై వెరైటీ రొయ్య పిల్లలు కనిపించాయి. వాటి మీసాలు 2 అడుగుల నుంచి 4 అడుగుల పొడవు ఉన్నాయి.
Also Read:Non Veg Milk: ‘నాన్ వెజ్ మిల్క్’ అంటే ఏంటి..? అమెరికాతో ఆ గొడవేంటి..?
వీటిని ‘ఆల్ రొయ్యలు’ అంటారని స్థానిక మత్స్యకారులు తెలిపారు. సముద్రంలో రాళ్ల మధ్య జీవించే ఈ రొయ్యలు వేడి ఎక్కువగా ఉంటే ఇలా రాళ్ళ పైకి వస్తుంటాయి. పిల్ల రొయ్యల మీసాలు ఈ పొడవు ఉంటే పెద్ద రొయ్యల గురించి కొత్తగా చెప్పాలిందేమి ఉంటుంది. కేజీ కంటే ఎక్కువ బరువు పెరుగుతాయని, రుచి ఉంటాయని మత్స్యకారులు చెబుతున్నారు. కాగా ధర విషయంలో మటన్ తో పోటీపడతాయని, కేజీ 1200 నుంచి 1,500 వరకు ధర పలుకుతాయని చెబుతున్నారు.