మీసం సైజు కాస్త పెద్దగా ఉంటేనే రొయ్య మీసం అని కామెంట్ చేస్తుంటారు. అదే బారెడు మీసం కనిపిస్తే ఔరా…! అనాల్సిందే. సరిగ్గా వైజాగులో ఇలాంటి మీసం ఒకటి ఆశ్చర్య పరిచింది. అది మనుషులకు కాదు జానెడు రొయ్య కు కావడం ఆసక్తికరంగా మారింది. సాగర్ నగర్ సమీప సముద్రం లో వేటకు వెళ్ళిన మత్స్య కారులకు రాళ్లపై వెరైటీ రొయ్య పిల్లలు కనిపించాయి. వాటి మీసాలు 2 అడుగుల నుంచి 4 అడుగుల పొడవు ఉన్నాయి.…